మొదట హైకోర్టుకు వెళ్ళు . కేరళ జర్నలిస్టుకు సుప్రీంకోర్టు ఆదేశం

ఢిల్లీ నుంచి యూపీలోని హత్రాస్ కు వెళ్తున్న కేరళ జర్నలిస్ట్ సిద్దిక్ కప్పన్ కు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. మొదట అలహాబాద్ హైకోర్టుకు వెళ్లాలని కోర్టు సూచించింది. (బెయిల్ కోసం ఆయన సుప్రీం ని ఆశ్రయించారు.) హైకోర్టు బెయిల్ ఇవ్వకపోతే మళ్ళీ అత్యున్నత న్యాయస్థానంలో అప్పీలు చేసుకోవచ్ఛునని సీజేఐ ఎస్ ఏ. బాబ్డే అన్నారు. యూపీ పోలీసులు తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ కన్నన్ సుప్రీంకోర్టుకెక్కారు. హత్రాస్ ఘటనను కవర్ చేసేందుకు ఈయన ఆ జిల్లాకు […]

మొదట హైకోర్టుకు వెళ్ళు . కేరళ జర్నలిస్టుకు సుప్రీంకోర్టు ఆదేశం

Edited By:

Updated on: Oct 12, 2020 | 7:23 PM

ఢిల్లీ నుంచి యూపీలోని హత్రాస్ కు వెళ్తున్న కేరళ జర్నలిస్ట్ సిద్దిక్ కప్పన్ కు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. మొదట అలహాబాద్ హైకోర్టుకు వెళ్లాలని కోర్టు సూచించింది. (బెయిల్ కోసం ఆయన సుప్రీం ని ఆశ్రయించారు.) హైకోర్టు బెయిల్ ఇవ్వకపోతే మళ్ళీ అత్యున్నత న్యాయస్థానంలో అప్పీలు చేసుకోవచ్ఛునని సీజేఐ ఎస్ ఏ. బాబ్డే అన్నారు. యూపీ పోలీసులు తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ కన్నన్ సుప్రీంకోర్టుకెక్కారు. హత్రాస్ ఘటనను కవర్ చేసేందుకు ఈయన ఆ జిల్లాకు వెళ్తుండగా నిషిధ్ధ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు చెందిన వ్యక్తిగా పరిగణించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా.. కప్పన్ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ జర్నలిస్ట్ తరఫున సీనియర్ లాయర్ కపిల్ సిబల్ వాదించారు.