ప్రధాని కానుకలు..ఆన్‌లైన్‌లో అమ్మకాలు..!

|

Sep 14, 2019 | 2:30 PM

ప్రధాని నరేంద్ర మోదీ.. దేశవిదేశాల్లో పర్యటించినపుడు ఎన్నో రకాల బహుమతులు, జ్ఞాపికలు లభిస్తాయి. ఈ జ్ఞాపికలను విదేశాంగ మంత్రిత్వశాఖ ట్రెజరీలో జమ చేస్తారు. కానీ ఇప్పుడు ఈ మొమెంటోలను వేలంలో అమ్మకానికి పెట్టారు. ఈ మేరకు గత ఆరు నెలల్లో ప్రధానికి అందిన జ్ఞాపికల వేలం నేటినుంచి ప్రారంభమైనట్లుగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ పటేల్‌ తెలిపారు. అక్టోబర్‌ 3వ తేదీ వరకూ జ్ఞాపికల వేలం కొనసాగుతుందని ఆయన చెప్పారు. వేలంలో వచ్చే డబ్బును నమామి గంగే ప్రాజెక్టు […]

ప్రధాని కానుకలు..ఆన్‌లైన్‌లో అమ్మకాలు..!
Follow us on

ప్రధాని నరేంద్ర మోదీ.. దేశవిదేశాల్లో పర్యటించినపుడు ఎన్నో రకాల బహుమతులు, జ్ఞాపికలు లభిస్తాయి. ఈ జ్ఞాపికలను విదేశాంగ మంత్రిత్వశాఖ ట్రెజరీలో జమ చేస్తారు. కానీ ఇప్పుడు ఈ మొమెంటోలను వేలంలో అమ్మకానికి పెట్టారు. ఈ మేరకు గత ఆరు నెలల్లో ప్రధానికి అందిన జ్ఞాపికల వేలం నేటినుంచి ప్రారంభమైనట్లుగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ పటేల్‌ తెలిపారు. అక్టోబర్‌ 3వ తేదీ వరకూ జ్ఞాపికల వేలం కొనసాగుతుందని ఆయన చెప్పారు. వేలంలో వచ్చే డబ్బును నమామి గంగే ప్రాజెక్టు కోసం ఉపయోగిస్తారు.  సుమారు 2772 వస్తువులు, ఎక్కువగా పెయింటింగ్‌లు ఉన్నాయని చెప్పారు. జ్ఞాపికల విలువ కనిష్ఠంగా రూ.200 నుంచి గరిష్ఠంగా రూ.2.5 లక్షల వరకు ఉంటుందని పేర్కొన్నారు.. గతంలోనూ ప్రధానికి లభించిన కానుకలకు వేలం నిర్వహించారు. 1,800కుపైగా కానుకలకు ఈ ఏడాది జనవరిలో 15 రోజులపాటు ఆన్‌లైన్ వేలం నిర్వహించినట్టు ప్రహ్లాద్ తెలిపారు.