ఇస్రోకు పాకిస్తాన్ మహిళా వ్యోమగామి కంగ్రాట్స్

ఇస్రోకు పాకిస్తాన్ మహిళా వ్యోమగామి కంగ్రాట్స్

ఇస్రో చేపట్టిన చంద్రయాన్-2 మిషన్ లో చంద్రుని ఉపరితలం[పై లాండర్ దిగినప్పటికీ చివరి క్షణంలో సంకేతాలు పంపకపోవడంపై పాకిస్తానీయులు ఇస్రో పైన, ఇండియా పైన వ్యంగ్యంగా సెటైర్లు వేసినప్పటికీ.. ఆ దేశ తొలి మహిళా వ్యోమగామి నమీరా సలీం మాత్రం ఇస్రోను అభినందనలతో ముంచెత్తుతోంది. కరాచీలోని డిజిటల్ సైన్స్ మ్యాగజైన్ కు ఆమె ఈ మేరకు ఓ స్టేట్ మెంట్ రిలీజ్ చేస్తూ.. చంద్రుని సౌత్ పోల్ వద్ద లాండర్ సజావుగా, విజయవంతంగా దింపినందుకు తాను ఇస్రోను, […]

Pardhasaradhi Peri

|

Sep 09, 2019 | 4:07 PM

ఇస్రో చేపట్టిన చంద్రయాన్-2 మిషన్ లో చంద్రుని ఉపరితలం[పై లాండర్ దిగినప్పటికీ చివరి క్షణంలో సంకేతాలు పంపకపోవడంపై పాకిస్తానీయులు ఇస్రో పైన, ఇండియా పైన వ్యంగ్యంగా సెటైర్లు వేసినప్పటికీ.. ఆ దేశ తొలి మహిళా వ్యోమగామి నమీరా సలీం మాత్రం ఇస్రోను అభినందనలతో ముంచెత్తుతోంది. కరాచీలోని డిజిటల్ సైన్స్ మ్యాగజైన్ కు ఆమె ఈ మేరకు ఓ స్టేట్ మెంట్ రిలీజ్ చేస్తూ.. చంద్రుని సౌత్ పోల్ వద్ద లాండర్ సజావుగా, విజయవంతంగా దింపినందుకు తాను ఇస్రోను, ఇండియాను కూడా అభినందిస్తున్నానని పేర్కొంది. ఇది చరిత్రాత్మక విజయమే అని కూడా అభివర్ణించింది. నిజానికి ఇది దక్షిణాసియాకే ఒక ఘన విజయం. ఈ ప్రాంతానికే కాక, మొత్తం గ్లోబల్ స్పేస్ ఇండస్ట్రీకే గర్వకారణం.. సౌతాసియాలో.. అంతరిక్ష రంగంలో ప్రాంతీయ అభివృద్దికి సంబంధించి ఏ దేశం ఇలాంటిది సాధించినా కంగ్రాట్స్ చెప్పాల్సిందే అని నమీరా వ్యాఖ్యానించింది. అంతరిక్షంలో అన్ని రాజకీయ వైరుధ్యాలూ, తారతమ్యాలూ అంతరించిపోతాయని, మనలను కలిపేది, విభజించేది అంతా ఈ భూమి పైనే అని ఆమె చమత్కరించింది. 2008 లో పాక్ ప్రయోగించిన ‘ వర్జిన్ గెలాక్టిన్ ‘ రోదసీ నౌకలో అంతరిక్షయానం చేసిన పాక్ తొలి మహిళా వ్యోమగామి అయిన నమీరా.. 2008 ఏప్రిల్ లో ఎవరెస్టు శిఖరం కూడా అధిరోహించింది. ఇస్రో, ఇండియాలను అభినందించిన ఈమె ధైర్యానికి అంతా ఆశ్చర్యపోతున్నారు. అసలే పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సహా ఆ దేశ మంత్రులు, ప్రజలు కూడా భారత్ పట్ల విద్వేషం (విషం) వెలిగక్కుతున్న ఈ సమయంలో ఈమె చేసిన ఈ ప్రకటన అత్యంత సాహసోపేతమైనదే!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu