Ghulam Nabi Azad: పదవిచ్చిన కాంగ్రెస్ కు షాకిచ్చిన గులాం నబీ ఆజాద్.. అసంతృప్తే కారణమా..!

| Edited By: Ravi Kiran

Aug 17, 2022 | 3:43 PM

అనారోగ్య కారణాలతో తాను కొత్త బాధ్యతలను స్వీకరించలేనని గులాం నబీ ఆజాద్ ప్రకటించారు. జమ్మూ కశ్మీర్ లో 11 మందితో కాంగ్రెస్ పార్టీ మంగళవారం కొత్తగా ప్రచార కమిటీని ఏర్పాటుచేసింది. ఈకమిటీలో పీసీసీ చీఫ్ తో పాటు..

Ghulam Nabi Azad: పదవిచ్చిన కాంగ్రెస్ కు షాకిచ్చిన గులాం నబీ ఆజాద్.. అసంతృప్తే కారణమా..!
Gulam Nabi Azad
Follow us on

Ghulam Nabi Azad: జమ్మూ కశ్మీర్ లో బలపడేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్న కాంగ్రెస్ కు గట్టి షాక్ తగిలింది. జమ్ము కశ్మీర్ లో మంచి పట్టున్న కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ ను జమ్మూ కశ్మీర్ ప్రచార కమిటీ ఛైర్మన్ గా కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. అయితే కొద్దిసేపటికే తాను ఆపదవిని తిరస్కరిస్తున్నట్లు తెలుపుతూ.. రాజీనామా చేశారు. అనారోగ్య కారణాలతో తాను కొత్త బాధ్యతలను స్వీకరించలేనని గులాం నబీ ఆజాద్ ప్రకటించారు. జమ్మూ కశ్మీర్ లో 11 మందితో కాంగ్రెస్ పార్టీ మంగళవారం కొత్తగా ప్రచార కమిటీని ఏర్పాటుచేసింది. ఈకమిటీలో పీసీసీ చీఫ్ తో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారు. జిఎం సరూరి కన్వీనర్ గా.. తారిఖ్ హామీద్ ప్రచార కమిటీ వైస్ ఛైర్మన్ గా నియమితులయ్యారు.

కాంగ్రెస్ పార్టీలో మార్పు అవసరమని గులాం నబీ ఆజాద్ పార్టీలో ఉంటూనే తన గళాన్ని గట్టిగా వినిపించారు. కేంద్రమంత్రిగానూ పనిచేసిన ఆయనకు మంచి ట్రబుల్ షూటర్ గా పేరుంది. దీంతో జమ్మూ కశ్మీర్ లో త్వరలో ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో పార్టీని బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ ఓ ప్రయత్నాన్ని ప్రారంభించింది. కమిటీ ప్రకటించిన గంటల వ్యవధిలోనే కాంగ్రెస్ కు గులాంనబీ ఆజాద్ షాకిస్తూ.. తాను కొత్త బాధ్యతలను స్వీకరించనని తెలిపారు. తనకు బాధ్యతలు ఇచ్చినందుకు కాంగ్రెస్ అధిష్టానానికి కృతజ్ఞతలు చెప్పిన గులాం నబీ ఆజాద్.. అనారోగ్య సమస్యలతో తాను రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు.

అనారోగ్య కారణాల వల్ల తాను కొత్త బాధ్యతలు స్వీకరించడానికి నిరాకరించినా.. అధిష్టానంపై రాజీనామా చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అఖిల బారత కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీలో ఉన్న తనని జమ్ము కశ్మీర్ ప్రచార కమిటీ ఛైర్మన్ గా నియమించి తన హోదా తగ్గించారనే భావనలో గులాం నబీ ఆజాద్ ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్న ఆయన.. పార్టీలో సంస్థాగత మార్పులు కావాలని కోరుతూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి లేఖరాసిన 23 మంది నేతల్లో గులాం నబీ ఆజాద్ ఒకరు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..