Bank Manager Murder: సెలవు ఇవ్వలేదనీ.. బ్యాంకు మేనేజర్‌ని గన్‌తో కాల్చి చంపిన సెక్యురిటీ గార్డు!

సెలవు ఇవ్వలేదని ఓ బ్యాంకు సెక్యురిటీ గార్డు.. బ్యాంకు మేనేజర్‌ను గన్‌తో కాల్చి హత్య చేశాడు. ఈ ఘటన సోమవారం (మార్చి 17) మధ్యాహ్నం గాజియాబాద్‌లోనీ సరిహద్దులోని బలరామ్ నగర్ బ్రాంచ్‌లో ఉన్న పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ (PSB) లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..

Bank Manager Murder: సెలవు ఇవ్వలేదనీ.. బ్యాంకు మేనేజర్‌ని గన్‌తో కాల్చి చంపిన సెక్యురిటీ గార్డు!
PSB Bank Manager Murder Case

Updated on: Mar 17, 2026 | 5:19 PM

పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌లో మాజీ సైనికోద్యోగి అయిన రవీంద్ర హుడా సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. అయితే సోమవారం (మార్చి 16) మధ్యాహ్నం 1.15 గంటల ప్రాంతంలో మేనేజర్‌ అభిషేక్ కుమార్ (36) క్యాబిన్‌లోకి వెళ్లాడు. లోపల మాటల యుద్ధం జరిగింది. కాసేపటికే మేనేజర్‌ గది నుంచి తుపాకీ కాల్పుల శద్ధం వినిపించింది. అనంతరం రవీంద్ర అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే బ్యాంకు సిబ్బంది పరుగున వెళ్లి చూడగా మేనేజర్‌ రక్తం మడుగులో కనిపించాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు. సమాచారం అందుకున్న ఘజియాబాద్ పోలీసు అధికారులు ప్రధాన నిందితుడు రవీంద్రతో పాటు అతని సహచరుడు శిశుపాల్‌ను అదే రోజు రాత్రికి అరెస్టు చేసినట్లు తెలిపారు.

మృతుడిని బీహార్‌లోని పాట్నాకు చెందిన అభిషేక్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. అతను సాహిబాబాద్ సమీపంలోని భోప్రాలో ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నాడు. ఇక నిందితుడు బాఘ్‌పత్ జిల్లాలోని మన్సూర్‌పూర్‌కు చెందిన రవీందర్ హూడాగా పోలీసులు తెలిపారు. ప్రాథమిక విచారణలో సెక్యురిటీ గార్డు విధులకు గైర్హాజరైనట్లు పోలీసులకు తెలిసింది. దీంతోబ్రాంచ్ మేనేజర్ కుమార్ ఉదయం అతడిని పిలిచారు. అనంతరం మధ్యాహ్నం సుమారు 1 గంటకు ఆ గార్డు బ్రాంచ్‌కు వచ్చి, బ్రాంచ్‌లోనే డిపాజిట్ చేసిన తన డబుల్ బ్యారెల్ గన్‌ను ఇవ్వాలని కోరాడు. గన్‌ తీసుకున్న తర్వాత గార్డు మేనేజర్ క్యాబిన్‌కు వెళ్లాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సెక్యురిటీ గార్డు రవీంద్ర సెలవు అడిగిన ప్రతిసారి మేనేజర్‌ అభిషేక్‌ నిరాకరించేవాడని, ఒకవేళ సెలవు ఇచ్చిన జీతం కట్ చేసే వాడని బ్యాంకు సిబ్బంది తెలిపారు. ఈ విషయమై తో గార్డు, బ్యాంకు మేనేజర్‌ మధ్య వాగ్వాదం జరిగిందని.. ఈ క్రమంలో గార్డు అతనిపై కాల్పులు జరిపినట్లు దర్యాప్తులో తేలింది. కాల్పుల్లో ఒక తూటా మేనేజర్ ఛాతీకి తగిలింది. అనంతరం గార్డు, అతనితో పాటు ఉన్న వ్యక్తి గన్‌తోపాటు బ్యాంకు నుంచి పరారైనట్లు అని అంకుర్ విహార్ సర్కిల్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) జ్ఞాన్ ప్రకాష్ రాయ్ తెలిపాడు.

బ్రాంచ్ సిబ్బంది గాయపడిన మేనేజర్‌ను ఢిల్లీలోని జీటీబీ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఆయన మరణించారని ఏసీపీ తెలిపారు. బ్రాంచ్ భవనం సమీపంలో అమర్చిన కెమెరాలోని సీటీవీ ఫుటేజీలో, నిందితులు ఇద్దరు తుపాకీతో బ్యాంకు నుంచి బయటకు నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. నిందిత సెక్యూరిటీ గార్డును బ్యాంకు కాకుండా ఓ సెక్యూరిటీ ఏజెన్సీ నియమించిందని అధికారులు తెలిపారు. నిందితుడు 2018లో పదవీ విరమణ చేసిన మాజీ సైనికుడు. సెలవుల విషయంలో అసంతృప్తికి గురయ్యాడు. నేరానికి ఉపయోగించిన గన్‌కి లైసెన్స్ ఉందని, గార్డును గుర్తించి అరెస్టు చేశామని, ఈ ఘటన వెనుక ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉన్నట్లు తేలితే తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సురేంద్ర నాథ్ తివారీ అన్నారు.

ఇవి కూడా చదవండి

సాయంత్రం, లాల్ బాగ్ అడవులలో అనుమానితుడైన సెక్యూరిటీ గార్డును, అలాగే అతని సహచరుడైన 48 ఏళ్ల షీష్ పాల్‌ను పోలీసు బృందాలు అరెస్టు చేశాయని ఏసీపీ రాయ్ హెచ్‌టితో చెప్పారు. సెలవులు, జీతాల విషయాల్లో మేనేజర్‌పై మనస్పర్థలతో ఉన్నానని ప్రధాన నిందితుడైన సెక్యూరిటీ గార్డు చెప్పాడు. రెండో నిందితుడైన షీష్ పాల్ ఆ సెక్యూరిటీ గార్డు ఇంట్లో పనిచేసే సహాయకుడు. బ్యాంకులో హత్య జరిగిన సమయంలో అతను కూడా గార్డుతో పాటే ఉన్నట్లు ఏసీపీ తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us