G7 Summit – India: ఎట్టకేలకు G7 సమ్మిట్‌కు రావాలంటూ భారత్‌కు ఆహ్వానం అందింది. దాంతో భారత ప్రధాన మంత్రి మోదీని ఈ సదస్సుకు ఆహ్వాచించేందుకు జర్మనీ ఇష్టపడటం లేదనే వార్తలకు తెరపడింది. ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న యుద్దం నేపథ్యంలో జరుగుతున్న G7 సమ్మిట్ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ కూటమిలో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికా సభ్య దేశాలుగా ఉన్నాయి. సమావేశాలకు మరి కొన్ని దేశాలను కూడా ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తోంది. జూన్ నెల 26, 27, 28 తేదీల్లో బవేరియన్ ఆల్ప్స్‌లోని ష్లోస్ ఎల్మావులో జరుగుతున్న ఈ సదస్సుకు జర్మనీ ఆతిథ్యం ఇస్తోంది. కాగా భారత్‌ను G7 సమ్మిట్‌కు ఆహ్వానించడం జర్మనీకి ఇష్టం లేదనే వార్తలు వినిపించాయి.
ఉక్రెయిన్ మీద యుద్దం సాగిస్తున్న రష్యా విషయంలో భారత్ అనుసరిస్తున్న వైఖని జర్మనీకి నచ్చలేదంటున్నారు. UNHRC నుంచి రష్యాను బహిష్కరించేందుకు ఓటింగ్‌లో భారత్ పాల్గొనలేదు. అలాగే రష్యా నుంచి చమురు కొనుగోలు అంశంలో కూడా భారత్ సానుకూలంగా వ్యవహరించింది. ఈ విషయంలో కినుక వహించిన జర్మనీ భారత్‌ను G7 సమ్మిట్‌కు దూరం పెడుతోందని ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలను జర్మనీ ఖండించింది. అంతే కాదు భారత్‌తోపాటు మరి కొన్ని దేశాలనూ ఆహ్వానిస్తున్నట్లు స్పష్టం చేసింది.
భారత్, జర్మనీ మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. ఫిబ్రవరిలో విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ జర్మనీలో పర్యటించారు. 2019లో అప్పటి జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ భారత్‌లో పర్యటించారు. కాగా 2019 నుండి G7 శిఖరాగ్ర సమావేశానికి భారతదేశాన్ని వరుసగా ఆహ్వానించడం ఇది నాల్గవసారి.
Also read:
Viral Video: ప్రతి కుక్కకు ఓ రోజు వస్తుందంటే ఇదేనేమో!.. వారు వెళ్లడమే ఆలస్యం.. రచ్చ రచ్చ చేసేశాయ్..!
Viral Video: గుడ్లను కాపాడేందుకు తల్లి పక్షి అద్భుత పోరాటం.. గుండెలు పిండేస్తున్న షాకింగ్ వీడియో..!
Viral Video: ఇది కదా రాజసం అంటే.. ఈ పిల్లి వీడియో చూస్తే ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయం..!