Gautam Adani: రథయాత్ర ఉత్సవానికి కుటుంబంతో పాటు గౌతమ్ అదానీ హాజరు..

ఒడిశాలోని పూరీలో జరుగుతోన్న రథయాత్ర ఉత్సవానికి ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ, ఆయన కుటుంబం ఈరోజు అనగా శనివారం హాజరయ్యారు. అదానీతో పాటు ఆయన భార్య ప్రీతి అదానీ, కుమారుడు కరణ్ అదానీ ఉన్నారు. అందుకు సంబంధించిన వీడియో ఇక్కడ చూసేయండి. 

Gautam Adani: రథయాత్ర ఉత్సవానికి కుటుంబంతో పాటు గౌతమ్ అదానీ హాజరు..
Gautam Adani -Jagannadh Yatra

Updated on: Jun 28, 2025 | 2:42 PM

ఒడిశాలోని పూరీలో జరుగుతోన్న రథయాత్ర ఉత్సవానికి ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ, ఆయన కుటుంబం ఈరోజు అనగా శనివారం హాజరయ్యారు. అదానీతో పాటు ఆయన భార్య ప్రీతి అదానీ, కుమారుడు కరణ్ అదానీ ఉన్నారు. అందుకు సంబంధించిన వీడియో ఇక్కడ చూసేయండి. 

మరోవైపు ఒడిశాలోని పూరీలో జగన్నాథ రథయాత్ర రెండో రోజు కన్నుల పండువగా సాగుతోంది. లక్షలాదమంది భక్తులు ఈ దివ్య ఘట్టాన్ని చూడడానినికి తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. డ్రోన్లతో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. విదేశాల నుంచి కూడా ఈసారి భారీగా భక్తులు తరలివచ్చారు. ఏడాదికోసారి ఆలయం నుంచి పురవీధుల్లోకి వచ్చే స్వామివారు.. గుండిచా ఆలయానికి చేరుకుంటారు.

జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర రథాలను లాగేందుకు భక్తులు పోటీపడుతున్నారు. హరే కృష్ణ నామస్మరణలు, జై జగన్నాథ నినాదాలతో వీధులు మార్మోగాయి. ఈ ఆధ్యాత్మిక సందడిలో పాల్గొనేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామి రథాన్ని లాగి తరిస్తున్నారు. ఈ వేడుకలో 12 లక్షల మందికి పైగా భక్తులు పాల్గొంటారన్న అంచనాతో అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. తొలిసారిగా 275 ఏఐ కెమెరాలు, డ్రోన్లతో రద్దీ నియంత్రణకు ఏర్పాట్లు చేసింది.