G20 Summit in India: జీ20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ సాయంత్రం భారత్ చేరుకున్నారు. కేంద్ర పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అమెరికా అధ్యక్షుడికి బైడెన్‌కి ఘన స్వాగతం పలికారు. అత్యంత పటిష్ట బందోబస్తు మధ్య ఈ నెల 10 వరకు బైడెన్ భారత పర్యటన కొనసాగనుంది. ఢిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్‌లో బైడెన్ బస చేయనున్నారు. అమెరికా ప్రతినిధుల బృందం కూడా చాణక్యపురిలోని ఈ 5 స్టార్ హోటల్‌లోనే బస చేస్తారు. హోటల్ దగ్గర బైడెన్‌కు స్వాగతం పలికేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హోటల్ దగ్గర భద్రతా సిబ్బంది మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. యూఎస్ సీక్రెస్ సర్వీస్ కమాండోలు కొన్ని రోజుల ముందే ఐటీసీ మౌర్య హోటల్‌ని తమ భద్రతా వలయంలోకి తీసుకున్నారు. ఢిల్లీ పోలీసులు, పారామిలిటరీ దళాలు హోటల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పహారా కాస్తున్నారు. సమీప ప్రాంతాల్లో వాహన రాకపోకలపై ఆంక్షలు విధించారు.
అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కి స్వాగతం పలికిన కేంద్ర మంత్రి వీకే సింగ్..
#WATCH | G-20 in India: US President Joe Biden arrives in Delhi for the G-20 Summit
He was received by MoS Civil Aviation Gen (Retd) VK Singh pic.twitter.com/U0qyG0aFcp
— ANI (@ANI) September 8, 2023
గతంలోనూ ఈ హోటల్‌లో పలువురు ప్రపంచ అగ్రనేతలు బస చేశారు. అమెరికా అధ్యక్ష హోదాలో బిల్ క్లింటన్, జార్జి డబ్ల్యూ బుష్, బరాక్ ఒబామా, డొనాల్డ్ ట్రంప్ ఢిల్లీలో పర్యటించినప్పుడు ఐటీసీ మౌర్య హోటల్‌లోనే బస చేశారు. ఈ హోటల్‌లో 411 రూమ్స్, 26 సూట్స్ ఉన్నాయి. మునుపటిలానే బైడెన్ కోసం హోటల్‌ను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసింది ఐటీసీ మౌర్య హోటల్ యాజమాన్యం.
ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్న బైడెన్
#WATCH | G-20 in India: US President Joe Biden departs for hotel after he arrived in Delhi for the G-20 Summit
He will hold a bilateral meeting with PM Narendra Modi later today#G20India2023 pic.twitter.com/w9Z1hMbXtG
— ANI (@ANI) September 8, 2023
శని, ఆదివారాల్లో నిర్వహించే జీ20 శిఖరాగ్ర సదస్సులో ఇతర ప్రపంచ అగ్రనేతలతో పాటు బైడెన్ పాల్గొననున్నారు. ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీతో అమెరికా అధ్యక్షుడు బైడెన్ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఉక్రెయిన్ – రష్యా మధ్య కొనసాగుతున్న యుద్ధం సహా పలు అంశాలపై చర్చించనున్నారు. శని, ఆదివారాల్లో ఇతర దేశాల అగ్రనేతలతోనూ బైడెన్ విడివిడిగా భేటీకానున్నారు.