ఖలిస్తాన్ అంశంపై బ్రిటన్ ప్రధాని రిషి సునక్ కీలక ప్రకటన చేశారు. జీ 20 సదస్సులో పాల్గొనేందుకు భారత్‌కు వచ్చిన సునక్.. యూకే ఎలాంటి తీవ్రవాదం, హింసను అంగీకరించదని స్పష్టం చేశారు. ANIతో మాట్లాడుతూ, ఖలిస్తాన్ సమస్యపై తాము భారత ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నామని బ్రిటన్ ప్రధాని చెప్పారు.
బ్రిటన్ ప్రధానమంత్రి అయిన తర్వాత మొదటిసారి భారతదేశానికి వచ్చిన సునాక్.. తీవ్రవాదం అంశంపై సీరియస్‌గా స్పందించారు. ‘బ్రిటన్‌లో ఎలాంటి తీవ్రవాదం, హింస జరిగినా సహించేది లేదు. ఈ తరహా తీవ్రవాదాన్ని రూపుమాపుతాం. దీన్ని అస్సలు తట్టుకోలేను.’ అని స్పష్టం చేశారు. ఇక అంతకు ముందు బ్రిటన్ నుంచి ఢిల్లీకి వచ్చిన సునాక్‌కు పాలెం విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. కేంద్ర మంత్రి అశ్విని కుమార్ చౌబే ఆయనకు జై సియారామ్‌తో కలిసి స్వాగతం పలికారు.
అదే సమయంలో, హిందూ మతంతో తనకున్న అనుబంధం గురించి, రిషి సునక్ మాట్లాడుతూ.. తాను హిందువునని గర్వంగా చెప్పుకుంటానని అన్నారు. తాను హిందువుగానే పెరిగానన్నారు. తాను ఎలా ఉన్నా.. తన విధులు తనవేనని ఉద్ఘాటించారు. విశ్వాసం అనేది తన జీవితంలో విశ్వాసం ఉన్న ప్రతి వ్యక్తికి సహాయపడే విషయం అని తాను నమ్ముతున్నాను అని పేర్కొన్నారు. అంతేకాదు.. భారత్‌కు వచ్చిన తాను.. ఏదైనా ఆలయాన్ని సందర్శిస్తానని చెప్పారు. ఇప్పుడే రక్షా బంధన్ వేడుకల్లో పాల్గొన్నానని, తన అక్కలు తనకు రాఖీ కట్టారని చెబుతూ మురిసిపోయారు. ఆ రోజు జన్మాష్టమిని సరిగ్గా జరుపుకోవడానికి తనకు సమయం లేదన్న సునాక్.. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికీ తాను సమయం ఇస్తానని అన్నారు.
‘జి 20 భారత్‌కు పెద్ద విజయం. దీనికి ఆతిథ్యం ఇవ్వడానికి సరైన సమయంలో భారతదేశం సరైన దేశం. కొన్ని రోజులు ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి మనకు చాలా మంచి అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను’ అని రుషి సునాక్ అన్నారు. ‘వసుధైవ కుటుంబం’ గురించి ఆయన మాట్లాడుతూ.. ఇది గొప్ప అంశమని అన్నారు. అలాగే, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, FTA సహా అనేక ఇతర అంశాలపై కూడా ఆయన మాట్లాడారు.
#WATCH | G-20 in India | On the Khalistan issue, United Kingdom Prime Minister Rishi Sunak to ANI says, “It’s a really important question and let me just say unequivocally that no form of extremism or violence like that is acceptable in the UK. And that’s why we are working very… pic.twitter.com/443p1vz1pS
— ANI (@ANI) September 8, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..