Free Tea for Drivers: ట్రక్కు డ్రైవర్లకు గుడ్‌న్యూస్.. హైవేలపై రాత్రిపూట ఉచితంగా టీ, వసతుల ఏర్పాటు

|

Dec 22, 2023 | 1:52 PM

ఒడిశా రాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాత్రిపూట ప్రయాణించే లారీ డ్రైవర్లకు ఉచితంగా టీ అందించాలని నిర్ణయించింది. రోడ్డుకు ఇరువైపులా ఉంటే దాబాలు, హోటళ్ళల్లో ఛాయ్ అందించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ఒడిశా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆ రాష్ట్ర మంత్రి టుకుని సాహు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు.

Free Tea for Drivers: ట్రక్కు డ్రైవర్లకు గుడ్‌న్యూస్.. హైవేలపై రాత్రిపూట ఉచితంగా టీ, వసతుల ఏర్పాటు
Free Tea For Drivers
Follow us on

ఒడిశా రాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాత్రిపూట ప్రయాణించే లారీ డ్రైవర్లకు ఉచితంగా టీ అందించాలని నిర్ణయించింది. రోడ్డుకు ఇరువైపులా ఉంటే దాబాలు, హోటళ్ళల్లో ఛాయ్ అందించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ఒడిశా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆ రాష్ట్ర మంత్రి టుకుని సాహు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు.

ఒడిశాలో రోడ్డు ప్రమాదాల నివారణకు రవాణా శాఖ సరికొత్త ఆలోచన చేసింది. రాత్రి వేళల్లో డ్రైవింగ్ చేసే డ్రైవర్ల నిద్రకు భంగం కలిగించేలా రోడ్డు పక్కన ఉన్న దాబాలు, హోటళ్లలో రవాణా శాఖ టీ అందించనుంది. ఈ మేరకు రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది. రహదారులపై తరచుగా జరుగుతున్న ప్రమాదాల్లో ఎంతోమంది మృతి చెందుతున్నారని, ఈ పరిస్థితిని నియంత్రించాలని సీఎం నవీన్ పట్నాయక్ ఆదేశించారని ఆమె తెలిపారు. ట్రక్ డ్రైవర్లకు రాత్రిపూట డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నిద్రను దూరం చేయడానికి ఉచితంగా టీ ఇవ్వాలని నిర్ణయించామని మంత్రి వెల్లడించారు. దీంతో పాటు వారికి విశ్రాంతి కోసం ఏర్పాటు కూడా ఉచితంగా అందించనున్నారు. ఇందుకోసం హోటల్, దాబా యజమానులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి జిల్లాలో ట్రక్ టెర్మినల్స్ నిర్మించామన్నారు మంత్రి సాహు. డ్రైవర్లకు అవగాహన కల్పించడం ద్వారా రోడ్డు ప్రమాదాలు, వాటి వల్ల జరిగే మరణాలను అరికట్టవచ్చని ఆమె వెల్లడించారు.

రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయని రవాణా శాఖ మంత్రి తుక్కుని సాహు అన్నారు. ప్రమాదాల నివారణకు రోడ్డు భద్రతా సమావేశం నిర్వహించారు. ప్రతి ప్రాణం విలువైనదే. అటువంటి పరిస్థితిలో ఇలాంటి చర్యలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. తమ ప్రయత్నానికి అందరి నుండి సహకారం లభిస్తుందని ఆశిస్తున్నామన్నారు. ఒడిశాలో రోడ్డు ప్రమాదాల్లో రోజుకు సుమారు 15 మంది మృత్యువాత పడుతుండటం గమనార్హం. గతేడాది నివేదికలో ఈ విషయం స్పష్టమైంది. గత ఏడాది ఒడిశా రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 5,467 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…