Shashi Tharoor: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతకు అరుదైన గౌరవం.. శశిథరూర్ ను వరించిన అదృష్టం

|

Aug 12, 2022 | 8:43 AM

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ కు అరుదైన గౌరవం దక్కింది. విశిష్టమైన సైనిక లేదా పౌర ప్రతిభను చూపించే వారికి ప్రాన్స్ ప్రభుత్వం అందించే అత్యున్నత పౌర పురస్కారం డీ లా లెజియన్ డీహొన్నేర్ కు ఎంపికయ్యారు. ఈవిషయాన్ని ఢిల్లీలోని ఫ్రెంచ్ రాయబారి లేఖ ద్వారా

Shashi Tharoor: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతకు అరుదైన గౌరవం.. శశిథరూర్ ను వరించిన అదృష్టం
Sashi Tharoor
Follow us on

Shashi Tharoor: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ కు అరుదైన గౌరవం దక్కింది. విశిష్టమైన సైనిక లేదా పౌర ప్రతిభను చూపించే వారికి ప్రాన్స్ ప్రభుత్వం అందించే అత్యున్నత పౌర పురస్కారం డీ లా లెజియన్ డీహొన్నేర్ కు ఎంపికయ్యారు. ఈవిషయాన్ని ఢిల్లీలోని ఫ్రెంచ్ రాయబారి లేఖ ద్వారా శశి థరూర్ కు సమాచారం ఇచ్చారు. 1802లో ఫ్రెంచ్ మిలటరీ లీడర్ నెపోలియన్ బోనపార్టీ ఈపురస్కారాన్ని ఏర్పాటు చేశారు. ఫ్రెంచ్ ప్రభుత్వానికి చెందిన మంత్రి ఎవరైనా భారత దేశ పర్యటనకు వచ్చినప్పుడు శశి థరూర్ కు ఈపురస్కారాన్ని అందజేస్తారు. తిరువనంతపురం ఎంపీగా ఉన్న శశి థరూర్ విదేశీ వ్యవహారాలపై పార్లమెంటు స్థాయి సంఘం ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మానవ వనరుల అభివృద్ధి, విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగానూ పనిచేశారు. అలాగే ట్విట్టర్ లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే శశిథరూర్ అత్యంత ఆంగ్ల పదాలను తన ట్వీట్టలో ఉపయోగిస్తుంటారు.

తనకు అరుదైన గౌరవం దక్కడం పట్ల శశిథరూర్ స్పందించారు. ఫ్రాన్స్ తో భారత సంబంధాలను గౌరవించే, భాషను ప్రేమించే, సంస్కృతిని ఆరాధించే వ్యక్తిగా… తనకు ఈ గుర్తింపు దక్కడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. తనకు ఈ విశిష్టమైన అత్యున్నత పురస్కారాన్ని ప్రదానం చేయడం సముచితమని భావించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాని శశి థరూర్ ట్విట్టర్ లో తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ కు అత్యున్నత పురస్కారం దక్కడంపై సోషల్ మీడియా వేదికగా అందరి నుంచి ఆయన ప్రశంసలు అందుకుంటున్నారు. లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి స్పందిస్తూ.. థరూర్ తన అసాధారణ పాండిత్యం, అమితమైన జ్ఞానానికి ఫ్రాన్స్ లోని అత్యున్నత పౌర పురస్కారం పొందుతున్నారని తెలుసుకుని ఎంతో సంతోషిస్తున్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి


మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..