మాటలకందని విషాదం..! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చిన్నారులు సజీవ దహనం..

|

Feb 09, 2023 | 12:11 PM

ఆకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఇంట్లో చిక్కుకున్న నలుగురు చిన్నారులు సజీవదహనం అయ్యారు. ఆ విషాద ఘటన హిమాచల్‌ప్రదేశ్‌లో మంగళవారం (ఫిబ్రవరి 7) చోటు చేసుకుంది..

మాటలకందని విషాదం..! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చిన్నారులు సజీవ దహనం..
Fire Accident
Follow us on

ఆకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఇంట్లో చిక్కుకున్న నలుగురు చిన్నారులు సజీవదహనం అయ్యారు. ఆ విషాద ఘటన హిమాచల్‌ప్రదేశ్‌లో మంగళవారం (ఫిబ్రవరి 7) చోటు చేసుకుంది. అబోటాబాద్ అసిస్టెంట్ కమీషనర్ సక్లైన్ సలీమ్‌ తెలిపన వివరాల ప్రకారం.. యూపీలోని ఉనా జిల్లాలో అబోటాబాద్‌ పండ్ల మార్కెట్‌ సమీపంలో ఓ స్లమ్‌ ఏరియాలో ఎలక్ట్రిక్‌ షార్ట్‌ సర్క్యూట్‌ (విద్యూదాఘాతం) కారణంగా రెండు గుడిసెలకు మంటలు అంటుకున్నాయి. ఈ దుర్ఘగనలో నలుగురు చిన్నారులు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. మృతులను బిహార్‌లోని దర్బంగా జిల్లా నుంచి వలస వచ్చిన కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. మృతులందరూ ఒకే కుటుంబానికి చెందిన శివమ్‌ కుమార్‌(6), గోలుకుమార్‌ (7), నీతు (14)గా గుర్తించారు. ఈ ప్రమాదంలో మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

మూడు ఫైర్‌ వెహికల్స్‌ అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని గంటన్నరపాటు శ్రమించి మంటలను అదుపుచేశారు. మృతులతోపాటు, గాయాలపాలైన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఏపీపీ డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ ఎమ్సీ డాక్టర్ జునైద్ సర్వర్ మాలిక్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.