మాజీ సీఎంకు కరోనా పాజిటివ్…కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న రెండ్రోజులకే..

|

Apr 09, 2021 | 4:11 PM

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. పలువురు ప్రముఖులు కూడా కరోనా వైరస్ బారినపడుతున్నారు.

మాజీ సీఎంకు కరోనా పాజిటివ్...కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న రెండ్రోజులకే..
Former Jammu and Kashmir CM Omar Abdullah
Follow us on

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. పలువురు ప్రముఖులు కూడా కరోనా వైరస్ బారినపడుతున్నారు. తాజాగా జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. తనకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా వైరస్ సోకినట్లు తేలిందని స్వయంగా ఆయన శుక్రవారం మధ్యాహ్నం ట్విట్టర్‌లో వెల్లడించారు. గత ఏడాది కాలంగా కరోనా నుంచి తాను తప్పించుకున్నా…చివరకు దాని బారినపడ్డట్లు తెలిపారు. కరోనా లక్షణాలు లేవని…వైద్యుల సలహా మేరకు తన ఇంట్లోనే సెల్ఫ్ ఐసొలేషన్‌లో ఉంటున్నట్లు తెలిపారు. ఆక్సిజన్ మోతాదు, ఇతర కీలక అంశాలను తరచూ చెక్ చేసుకుంటున్నట్లు తెలిపారు.

ఒమర్ అబ్దుల్లా తండ్రి, నేషనల్ కాన్ఫెరెన్స్ చీఫ్ ఫరూఖ్ అబ్దుల్లాకు కరోనా సోకడంతో వారం రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొంది రెండ్రోజుల క్రితమే డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పుడు ఆయన తనయుడు ఒమర్ అబ్దుల్లా కూడా కరోనా బారినపడ్డారు. రెండ్రోజుల క్రితమే ఆయన తొలి కోవిడ్ వ్యాక్సిన్ కూడా వేయించుకున్నారు.