జమ్మూ కాశ్మీర్ లో బలవంతపు మత మార్పిడులు.. సిక్కుల ఆందోళన.. నివారణకై కేంద్ర మంత్రికి అభ్యర్థన

జమ్మూ కాశ్మీర్ లో ఇద్దరు సిక్కు మహిళల బలవంతపు మత మార్పిడులపై సిక్కు నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. వీరితో కూడిన ఓ ప్రతినిధి బృందం మంగళ వరం కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డిని కలిసి ఆయనకు ఓ మెమోరాండం సమర్పించింది.

జమ్మూ కాశ్మీర్ లో బలవంతపు మత మార్పిడులు.. సిక్కుల ఆందోళన.. నివారణకై కేంద్ర మంత్రికి అభ్యర్థన
Sikh Leaders Protest

Edited By:

Updated on: Jun 30, 2021 | 12:17 AM

జమ్మూ కాశ్మీర్ లో ఇద్దరు సిక్కు మహిళల బలవంతపు మత మార్పిడులపై సిక్కు నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. వీరితో కూడిన ఓ ప్రతినిధి బృందం మంగళ వరం కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డిని కలిసి ఆయనకు ఓ మెమోరాండం సమర్పించింది. ఈ విధమైన ఘటనలు జరగకుండా చూడాలని వీరు తమ వినతి పత్రంలో కోరారు. జమ్మూ కాశ్మీర్ లోని అనేక ప్రాంతాల్లో నిన్న సిక్కులు ఆందోళనకు పూనుకొన్న విషయం తెలిసిందే.. ఈ నిరసనల్లో ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్ మెంట్ కమిటీ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఈ మహిళలను బలవంతంగా మతం మార్పించి పెళ్లి చేసుకున్నారని.. ఆ మహిళల కుటుంబాలు తీవ్ర ఆవేదనతో ఉన్నాయని సిక్కు నేతలు పేర్కొన్నారు.. ఇంత జరుగుతున్నా కాశ్మీర్ లోని ముస్లిములు మౌన ప్రేక్షక పాత్ర వహించారని వారు ఆరోపించారు. పంజాబ్ లో కాశ్మీరీ యువతులను తాము ఎంతో గౌరవ ప్రదంగా చూస్తామని.. లోగడ ఈ విధమైన ఘటనలకు ఆస్కారం లేకుండా చూశామని వారన్నారు.

ప్రశాంతమైన కాశ్మీర్ లో బలవంతపు మత మార్పిడులు జరగడం శోచనీయమని సిక్కు నేతలు అన్నారు. స్థానికంగా ఉన్న సిక్కులు కూడా దీన్ని ప్రతిఘటించారన్నారు. కాగా బలవంతపు మతమార్పిడిల విషయాన్నీ కేంద్రం సీరియస్ గా పరిగణిస్తుందని.. ఈ విద్గమైన ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వారికి హామీనిచ్చారు. ఇందుకు బాధ్యులైనవారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: పార్లమెంటరీ కమిటీ ఎదుట హాజరైన ఫేస్ బుక్, గూగుల్ ఇండియా ప్రతినిధులు..ఏం చెప్పారంటే ..

కాంగ్రెస్ పార్టీ లేనిదే విపక్ష ఫ్రంట్ సాధ్యం కాదు.. అదే మరి బేస్..ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్

Loading...
Unable to load recommendations.
Follow Us