కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 11 గంటలకు లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ సారి కూడా బడ్జెట్‌పై పెద్ద అంచనాలేమీ పెట్టుకోవద్దనే సంకేతాల్ని శుక్రవారం ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే ద్వారా ముందే ఇండికేషన్ ఇచ్చినట్లైంది. ప్రస్తుత వృద్ధి రేటు లక్ష్యాన్ని.. 5 నుంచి 6 శాతానికే పరిమితం చేశారు.
కాగా, ఈ బడ్జెట్ సమావేశాల్లో మొత్తం 45 బిల్లులకు ఆమోదం పొందేలా కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. రెండు దశల్లో ఏప్రిల్ 3వ తేదీవరకు జరిగే ఈ సమావేశాల్లో పాతవి 17, కొత్త బిల్లులు 28లను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ షెడ్యూల్ చేసింది. అయితే ఈ 45 బిల్లుల్లో ఏపీ శాసనమండలి రద్దుకు సంబంధించిన బిల్లు లేదని పార్లమెంటరీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న అధికారులు స్పష్టం చేశారు. తరువాత ఆ బిల్లు పరిస్థితి ఏంటో తెలియదని.. అయితే ప్రస్తుతానికి మాత్రం ఖరారైన షెడ్యూల్‌లో ఏపీ శాసనమండలి రద్దుకు సంబంధించిన బిల్లుకు మాత్రం స్థానం లేదని పేర్కొన్నారు.
ఈ సమావేశాల్లో అతి ముఖ్యమైన ద్రవ్య, విత్తన, పెస్టిసైడ్స్ మేనేజ్‌మెంట్, నేషనల్ పోలీస్ యూనివర్సిటీ, ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ, ఆర్‌బీఐ చట్ట సవరణ, బ్యాంకింగ్ రెగ్యులేటరీ చట్ట సవరణ తదితర బిల్లులు సభ ముందుకు రానున్నాయి. అయితే గత బడ్జెట్‌లో ఆదాయపు పన్ను మినహాయింపును రూ.5 లక్షల వార్షిక ఆదాయం వరకూ పెంచిన విషయం తెలిసిందే. అయితే ఈ సారి దాన్ని రూ.7 లక్షల వరకు పెంచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
#WATCH Delhi: Finance Minister Nirmala Sitharaman with the ‘Bahi-Khata’. #Budget2020 ; She will present her second Budget today. pic.twitter.com/jfbSSHPMSy
— ANI (@ANI) February 1, 2020