లాక్ డౌన్ ముగిశాక.. మళ్ళీ విమాన సర్వీసులు ? ఆ ఒక్కటి తప్ప !

ఈ నెల 14 తో లాక్ డౌన్ కాల పరిమితి ముగుస్తోంది. దీంతో.. లాక్ డౌన్ ఎత్తివేసిన అనంతరం.. దేశంలో అన్ని దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను ప్రభుత్వం అనుమతించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  • Umakanth Rao
  • Publish Date - 11:23 am, Mon, 6 April 20
లాక్ డౌన్ ముగిశాక.. మళ్ళీ విమాన సర్వీసులు ? ఆ ఒక్కటి తప్ప !

ఈ నెల 14 తో లాక్ డౌన్ కాల పరిమితి ముగుస్తోంది. దీంతో.. లాక్ డౌన్ ఎత్తివేసిన అనంతరం.. దేశంలో అన్ని దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను ప్రభుత్వం అనుమతించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇది అనిశ్చితంగా ఉండవచ్ఛునని భావిస్తున్నారు. అంటే ఒకవేళ మళ్ళీ లాక్ డౌన్ పొడిగించిన పక్షంలో ఇలాగే సర్వీసులకు బ్రేక్ పడవచ్చు. కరోనా మహమ్మారి కారణంగా అన్ని రంగాల మాదిరే విమానయాన రంగం కూడా తీవ్ర సంక్షోభంలో పడింది. తాజాగా.. తమ సర్వీసులను నిరవధికంగా నిలిపివేస్తున్నట్టు ఎయిర్ డెక్కన్ ప్రకటించింది. తమ ఉద్యోగులను రిలీవ్ చేసింది. ఇండియాలో కరోనా వైరస్ సమస్య  ఇంకా తీవ్రంగా ఉందని, అందువల్లే ఏప్రిల్ 14 తరువాత విమాన సర్వీసులను పునరుధ్దరిస్తామా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేమని పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు చెందిన ఓ అధికారి చెప్పారు. ఈ నెల 14 తరువాత ఎయిర్ లైన్స్ బుకింగ్స్ తీసుకోవచ్ఛు అన్నారు. కానీ లాక్ డౌన్ పొడిగించిన పక్షంలో ఆ కాలానికి బుక్ చేసిన టికెట్లను రద్దు చేసే అవకాశం ఉందన్నారు. ఎయిరిండియా తమ బుకింగ్స్ ని ఈ నెల 30 వరకు నిలిపివేస్తున్నట్టు ఇదివరకే ప్రకటించింది.

ఆదాయం గణనీయంగా తగ్గడంతో ఇండిగో సంస్థ తమ ఉద్యోగులకు వారి వేతనాల్లో 25 శాతం కోత విధిస్తున్నట్టు తెలిపింది. ఇక విస్తారా ఎయిర్ లైన్స్.. తమ సీనియర్ ఉద్యోగులకు వేతనం లేకుండా మూడు రోజుల నిర్బంధ సెలవును ప్రకటించింది. ఇలాగే తమ సిబ్బందికి వేతనాలను 10 నుంచి 30 శాతం తగ్గిస్తున్నట్టు స్పైస్ జెట్ పేర్కొంది.