Flash Floods: కళ్లముందే వరదలో కొట్టుకుపోయిన ఎస్‏యూవీ వాహనం.. అంతుచిక్కని ఆ ముగ్గురి జాడ.. ఇంతకీ వారు ఏమైనట్టు..

|

Sep 24, 2022 | 6:07 PM

వరదలో ఓ పెద్ద SUV వాహనం కొట్టుకుపోతున్న దృశ్యాలు కనిపించాయి. ఆ పక్కనే ముగ్గురు వ్యక్తులు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. అంతలోనే..

Flash Floods: కళ్లముందే వరదలో కొట్టుకుపోయిన ఎస్‏యూవీ వాహనం.. అంతుచిక్కని ఆ ముగ్గురి జాడ.. ఇంతకీ వారు ఏమైనట్టు..
Flash Floods
Follow us on

Flash Floods: భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదలతో అరుణాచల్ ప్రదేశ్‌ చిగురుటాకుల వణికిపోతుంది. వర్షాలు, వరదలతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పరిస్థితి అస్థవ్యస్థంగా మారింది. రాష్ట్రంలోని చిపుటా గ్రామంలో వరదల కారణంగా జనజీవనం అతలాకుతలం అయింది.. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గ్రామంలో జనజీవనం స్తంభించింది. అరుణాచల్‌ ప్రదేశ్‌లో వరద ప్రభావం తీవ్రత ఎలా ఉందో చూపించే ఓ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతుంది. వీడియోలో ఓ గ్రామంలో ఆకస్మిక వరద తీవ్రత ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా కనిపిస్తుంది. సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియో చూసిన నెటిజన్లు వణికిపోతున్నారు.

వీడియోలో భారీ వరదలో ఓ పెద్ద SUV వాహనం కొట్టుకుపోతున్న దృశ్యాలు కనిపించాయి. ఆ పక్కనే ముగ్గురు వ్యక్తులు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నట్టుగా కనిపించింది. ఆ ప్రాంతంలో భారీ వర్షం, ఉధృతమైన వరద ప్రవాహం కనిపిస్తుంది. వరదలో నిల్చున్న ఆ ముగ్గురు వ్యక్తులు సాయం కోసం ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తుంది. వరద దాటికి SUV వాహనం కళ్లముందే కొట్టుకుపోయి లోతైన అగాదంలో పడిపోయింది. వాహనం కొట్టుకుపోతున్న దృశ్యాలను దూరంగా మరో కారులో ఉన్న కొందరు వ్యక్తులు తమ సెల్‌ఫోన్ల ద్వారా రికార్డ్‌ చేశారు. వాహనం కొట్టుకుపోయిన దృశ్యాలు చూస్తుంటే ఒళ్లు గగ్గురుపొడిచేలా కనిపించింది. వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రానికి భారీ వర్ష సూచన చేసింది భారత వాతావరణ శాఖ (IMD). ఈ క్రమంలోనే ఇప్పటికే రుతుపవనాల ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు, వరదలు అరుణాచల్‌ ప్రదేశ్‌ని అల్లాడిపోయేలా చేస్తుంది. ఇంకా రాష్ట్రాన్ని వరుణుడు వీడలేదని,ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది.

తాజాగా, దేశ రాజధాని ఢిల్లీ, ఎన్‌సీఆర్‌లలో కూడా గురువారం నుంచి కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వరద ప్రభావంతో గుర్గావ్, నోయిడా, ఢిల్లీలోని ఇతర ప్రదేశాలలో నీటమునిగిన రోడ్లు నదులను తలపిస్తున్నాయి. పొడవైన ట్రాఫిక్ జామ్‌లతో కూడిన రోడ్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి