ఐదుగురు ఎయిరిండియా పైలట్లకు కరోనా పాజిటివ్

| Edited By: Anil kumar poka

May 10, 2020 | 1:37 PM

ఎయిరిండియాకు చెందిన ఐదుగురు పైలట్లకు కరోనా పాజిటివ్ లక్షణాలు సోకాయి. ప్రాధాన్యతా ప్రాతిపదికపై 77 మంది పైలట్లను నిన్న టెస్ట్ చేసినప్పుడు వీరికి పాజిటివ్ ఉన్నట్టు వెల్లడైంది. అయితే ఇన్ఫెక్షన్ సోకినా..

ఐదుగురు ఎయిరిండియా పైలట్లకు కరోనా పాజిటివ్
Follow us on

ఎయిరిండియాకు చెందిన ఐదుగురు పైలట్లకు కరోనా పాజిటివ్ లక్షణాలు సోకాయి. ప్రాధాన్యతా ప్రాతిపదికపై 77 మంది పైలట్లను నిన్న టెస్ట్ చేసినప్పుడు వీరికి పాజిటివ్ ఉన్నట్టు వెల్లడైంది. అయితే ఇన్ఫెక్షన్ సోకినా.. వీరిలో ఎవరికీ ఎలాంటి సింప్టమ్స్ కనబడలేదు. (వీరిలో ఎవరూ దగ్గు లేదా శ్వాస సంబంధ రుగ్మతలతో బాధ పడలేదు). ఈ పైలట్లను హోం క్వారంటైన్ లో ఉండాలని అధికారులు సలహా ఇచ్చారు. ఈ అయిదుగురు పైలెట్లూ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ ని నడుపుతున్నారు. వీరిలో ఒకరు చివరి సారి గత నెల 20 న ఈ విమానాన్ని నడిపారు. ఈ కరోనా లాక్ డౌన్ కాలంలో విదేశాల్లో చిక్కుబడిన భారతీయులను ఎయిరిండియా విమానాలు స్వదేశానికి తరలిస్తున్నాయి.

కాగా…. కరోనా వైరస్ కు గురైన ఫ్రంట్ లైన్ వర్కర్లలో పైలట్లు కూడా చేరడం సంచలనమైంది. ఢిల్లీ, ముంబై నగరాలకు చెందిన సుమారు 100 మంది హెల్త్ వర్కర్లు ఇప్పటికే ఈ ఇన్ఫెక్షన్ కి గురయ్యారు. ఇక 500 మందికి పైగా భద్రతా దళ జవాన్లు కూడా ఈ వైరస్ బారిన పడ్డారు.