గుజరాత్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అహ్మదాబాద్ లోని సనంద్ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గుజరాత్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లో మంటలు చెలరేగాయి.
సమాచారం అందుకున్న వెంటనే.. స్థానిక ఫైర్ సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఎగిసిపడుతున్న మంటలను ఆర్పేందుకు 25 ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగాయాయి. మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదంలో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగి వుంటుందని స్థానిక అధికారులు అంచనా వేస్తున్నారు.
#WATCH Gujarat: Fire breaks out at a factory in GIDC (Gujarat Industrial Development Corporation) in Sanand area of Ahmedabad. 25 fire tenders present at the spot. Fire-fighting operation underway. No casualties reported. pic.twitter.com/shOrlBak5H
— ANI (@ANI) June 24, 2020