ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని హజ్రత్‌గంజ్ ప్రాంతంలోని కెనరా బ్యాంక్ భవనంలో మంటలు చెలరేగాయి. సోమవారం సాయంత్రం భవనం మొదటి అంతస్తులో మంటలంటుకున్నాయి.. ఆకస్మికంగా జరిగిన ప్రమాదంతో గందరగోళం నెలకొంది. తమ ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రజలు అద్దాలు పగులగొట్టి మెట్లపై నుంచి బయటకు వచ్చారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ వాహనాలు హుటాహుటినా సహాయక చర్యలు ప్రారంభించాయి.
సోమవారం సాయంత్రం హజ్రత్‌గంజ్ ప్రాంతంలోని నావల్ కిషోర్ రోడ్డులోని కెనరా బ్యాంక్ భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. నావెల్టీ సినిమా థియేటర్ వెనుక భాగంలో జరిగిన ఈ ప్రమాదంపై తీవ్ర దుమారం రేగింది. ఈ భవనంలోని మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మొదటి అంతస్తులో దాదాపు 50 మంది చిక్కుకుపోయినట్లు సమాచారం. ఇప్పుడు మంటలను అదుపు చేసి ప్రజలందరినీ సురక్షితంగా బయటకు తీశారు.
#WATCH | Uttar Pradesh | Fire breaks out at a bank in Hazratganj area of Lucknow. Employees of the bank seen getting out of the building through windows. Fire fighting operations are underway. pic.twitter.com/0z5K4twcHE
— ANI UP/Uttarakhand (@ANINewsUP) November 20, 2023
అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని భవనంలో ఉన్న ఉద్యోగులందరినీ సురక్షితంగా రక్షించినట్లు అధికారులు తెలిపారు. మంటలు చెలరేగిన తర్వాత, బ్యాంక్ ఉద్యోగులు ఆఫీసు కిటికీల నుండి దూకేందుకు ప్రయత్నించడం, తప్పించుకోవడానికి భవనం పైకి పరుగులు తీయటం కనిపించింది. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది వారందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. మంటలను ఆర్పివేసి అందరినీ రక్షించినట్లు అగ్నిమాపక అధికారి తెలిపారు.
మొదటి అంతస్తులో మంటలు చెలరేగడానికి విద్యుత్ షార్ట్‌సర్క్యూటే కారణమని ఫైర్ సెఫ్టీ అధికారులు చెబుతున్నారు. భవనం నుంచి కిటికీలోంచి తప్పించుకున్న ఓ బ్యాంకు ఉద్యోగి ఎయిర్ కండీషనర్ మంటల్లో కాలిపోవటంతో దుర్మరణం చెందాడు. ప్రమాదం జరిగిన సమయంలో లోపల దాదాపు 50 మంది ఉన్నారు. కిటికీలు పగలగొట్టి బయటకు దూకేందుకు ప్రయత్నించటంతో పలువురు గాయపడినట్టుగా చెప్పారు.