బీజేపీ అధ్యక్షుడితో పాటు మరో 150 మందిపై కేసు నమోదు..

వెస్ట్‌ బెంగాల్‌లో బీజేపీ వర్సెస్‌ టీఎంసీ వార్‌ నడుస్తోంది. గతేడాది కాలంగా.. రాష్ట్రంలో నిత్యం ఎక్కడో ఓ చోట బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో..

బీజేపీ అధ్యక్షుడితో పాటు మరో 150 మందిపై కేసు నమోదు..

Edited By:

Updated on: Jun 23, 2020 | 3:27 PM

వెస్ట్‌ బెంగాల్‌లో బీజేపీ వర్సెస్‌ టీఎంసీ వార్‌ నడుస్తోంది. గతేడాది కాలంగా.. రాష్ట్రంలో నిత్యం ఎక్కడో ఓ చోట బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో పలువురు కార్యకర్తలు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. తాజాగా టీఎంసీ కార్యకర్తల దాడిలో మిడ్నాపూర్‌ జిల్లాలోని డాంటాన్‌కు చెందిన బీజేపీ కార్యకర్త ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అతడికి నివాళులు అర్పించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌తో పాటు.. స్థానిక జిల్లాకు చెందిన అధ్యక్షులు, ఇతర నేతలు, స్థానిక బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అయితే ఈ క్రమంలో సోషల్ డిస్టెన్స్‌ పాటించలేదంటూ.. లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించారని వెస్ట్‌ బెంగాల్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్‌తో పాటు..మరో 150 బీజేపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. బీజేపీ కార్యకర్తలు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా.. ఈ కార్యక్రమం నిర్వహించారని.. అంతేకాకుండా.. సోషల్ డిస్టెన్స్‌ పాటించలేదని.. మిడ్నాపూర్‌ కొత్వాలీ పోలీసులు సుమోటుగా కేసులు నమోదు చేశారు.