అవినీతి కేసులో మాజీ కేంద్ర మంత్రి అరుణ్ శౌరి

| Edited By: Anil kumar poka

Sep 17, 2020 | 5:29 PM

ఓ అవినీతి కేసులో మాజీ కేంద్ర మంత్రి అరుణ్ శౌరిని నిందితునిగా సీబీఐ ప్రత్యేక కోర్టు ప్రకటించింది. రాజస్తాన్ ఉదయపూర్ లోని లక్ష్మీ విలాస్ ప్యాలస్ హోటల్ డిజిన్వెస్ట్ మెంట్ కేసుకు సంబంధించి అరుణ్ శౌరితో బాటు...

అవినీతి కేసులో మాజీ కేంద్ర మంత్రి అరుణ్ శౌరి
Follow us on

ఓ అవినీతి కేసులో మాజీ కేంద్ర మంత్రి అరుణ్ శౌరిని నిందితునిగా సీబీఐ ప్రత్యేక కోర్టు ప్రకటించింది. రాజస్తాన్ ఉదయపూర్ లోని లక్ష్మీ విలాస్ ప్యాలస్ హోటల్ డిజిన్వెస్ట్ మెంట్ కేసుకు సంబంధించి అరుణ్ శౌరితో బాటు మాజీ అధికారి ప్రదీప్ బైజాల్, హోటల్ యజమాని జ్యోత్సా సూరిలపై క్రిమినల్ కేసులు దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ హోటల్ అమ్మకాల వ్యవహారాన్ని మళ్ళీ చేపట్టాలని సూచించింది. లోగడ  ఏబీ వాజ్ పేయి ప్రభుత్వంలో పెట్టుబడుల ఉపసంహరణ శాఖ మంత్రిగా ఉన్న అరుణ్ శౌరి వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం వాటిల్లిందని కోర్టు పేర్కొంది. ఈ హోటల్ ఖరీదు రూ, 252 కోట్లు కాగా-దీనిని కేవలం రూ. 7.5 కోట్లకు అమ్మారని న్యాయస్థానం తెలిపింది. ఉదయపూర్ లో గల ఈ హోటల్ పేరును ఇప్పుడు లలిత్ లక్ష్మి విలాస్ ప్యాలస్ హోటల్ గా మార్చారు. 2002 నాటి ఈ కేసులో ఎలాంటి ఆధారాలూ లేవని 2019 లో సీబీఐ క్లోజర్ రిపోర్టును సమర్పించింది . అయితే జోధ్ పూర్ లోని స్పెషల్ కోర్టు.. ఆ నివేదికను తిరస్కరించింది. తదుపరి దర్యాప్తునకు ఆదేశించింది.

ఈ హోటల్ అమ్మకం లావాదేవీల్లో జరిగిన అవినీతి వల్ల ప్రభుత్వానికి రూ. 143. 48 కోట్ల నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. కాగా తాను కోర్టు ఉత్తర్వులను చూడలేదని, తన లాయర్ తో మాట్లాడతానని అరుణ్ శౌరి పేర్కొన్నారు.