ఖడ్గమృగాన్ని కాపాడిన జంతు సంరక్షణ అధికారులు

| Edited By:

Aug 15, 2020 | 10:49 PM

అసోంలో కురుస్తున్న భారీ వర్షాలు వన్యప్రాణుల పట్ల ప్రాణ సంకటంగా మారింది. ఇప్పటికే వందకు పైగా వన్య ప్రాణులు వరదల ధాటికి ప్రాణాలు విడిచాయి. ఇక కజిరంగా నేషనల్‌ పార్క్‌లో ఉన్న జంతువులు..

ఖడ్గమృగాన్ని కాపాడిన జంతు సంరక్షణ అధికారులు
Follow us on

అసోంలో కురుస్తున్న భారీ వర్షాలు వన్యప్రాణుల పట్ల ప్రాణ సంకటంగా మారింది. ఇప్పటికే వందకు పైగా వన్య ప్రాణులు వరదల ధాటికి ప్రాణాలు విడిచాయి. ఇక కజిరంగా నేషనల్‌ పార్క్‌లో ఉన్న జంతువులు అందులో నుంచి బయటకు కూడా పారిపోయాయి. అంతేకాదు.. అటు అటవీ శాఖ అధికారులు, పార్క్‌కు చెందిన అధికారులు అందులో ఉన్న జంతువులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే దగాన్‌ అనే ఓ గ్రామంలో ఓ ఖడ్గమృగం ప్రత్యక్షమైంది. తీవ్ర అనారోగ్యంతో ఉండటంతో అది కదలకుండా ఉండిపోయింది. విషయాన్ని కజిరంగా నేషనల్ పార్క్‌ అధికారులకు తెలియ జేయడంతో.. ఆ గ్రామానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు, వన్య ప్రాణి సంరక్షణ సభ్యులు ఆ ఖడ్గమృగాన్ని రక్షించారు.

Read More :

16 వేల అడుగుల ఎత్తులో రెపరెపలాడిన జాతీయ జెండా

అసోం వరదల బీభత్సం.. 112కి చేరిన మృతులు

ఏనుగు దాడిలో ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్ మృతి