Silver Price Today: స్వల్పంగా పెరిగిన కిలో వెండి ధర.. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ధరల వివరాలు

|

Feb 25, 2021 | 5:55 AM

Silver Price Today: ఒక వైపు బంగారం ధర తగ్గుముఖం పడుతుంటే.. వెండి మాత్రం మరీ స్వల్పంగా పెరిగింది. ఇటీవల బడ్జెట్‌లో బంగారం పై దిగుమతి సుంకాన్ని తగ్గించిన తర్వాత...

Silver Price Today: స్వల్పంగా పెరిగిన కిలో వెండి ధర.. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ధరల వివరాలు
Follow us on

Silver Price Today: ఒక వైపు బంగారం ధర తగ్గుముఖం పడుతుంటే.. వెండి మాత్రం మరీ స్వల్పంగా పెరిగింది. ఇటీవల బడ్జెట్‌లో బంగారం పై దిగుమతి సుంకాన్ని తగ్గించిన తర్వాత పసిడి ధరలు గణనీయంగా దిగివస్తున్నాయి. కానీ వెండి ధరలు మాత్రం పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ, దేశీయంగా ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే బంగారం తగ్గుతుంటే వెండి స్వల్పంగా పెరిగింది. తాజా వెండిపై పది రూపాయలు పెరిగింది. ఇక దేశీయంగా వెండి కిలో ధర రూ.70,510 ఉంది.

దేశీయంగా ధరలు ఇలా..

ఇక దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి రూ. 70,510 ఉండగా, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 70,510 ఉంది. చెన్నైలో రూ. 74,400 ఉండగా, బెంగళూరులో రూ.70010 ఉంది. కోల్‌కతాలో రూ.70,510 ఉండగా, హైదరాబాద్‌లో రూ.74,400 ఉంది. అలాగే విజయవాడలో రూ.74,400 ఉంది.