Gold Price Today: పసిడి ప్రియులకు శుభవార్త.. దిగివస్తున్న బంగారం ధర.. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు

Gold Rate Today: బంగారం ప్రియులకు శుభవార్త.. ఇటీవల బడ్జెట్‌లో బంగారం పై దిగుమతి సుంకాన్ని తగ్గించిన తర్వాత పసిడి ధరలు గణనీయంగా దిగివస్తున్నాయి. గత కొని..

Gold Price Today: పసిడి ప్రియులకు శుభవార్త.. దిగివస్తున్న బంగారం ధర.. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు
March 6th Gold Price

Updated on: Feb 25, 2021 | 5:56 AM

Gold Rate Today: బంగారం ప్రియులకు శుభవార్త.. ఇటీవల బడ్జెట్‌లో బంగారం పై దిగుమతి సుంకాన్ని తగ్గించిన తర్వాత పసిడి ధరలు గణనీయంగా దిగివస్తున్నాయి. గత కొని రోజులుగా క్రమంగా బంగారం ధర తగ్గుముఖం పట్టడంతో దేశీయంగా భారీ ఎత్తున కొనుగోలు మొదలయ్యాయి. అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ, దేశీయంగా ధరలు తగ్గుముఖం పట్టడం గమనార్హం. అయితే కొన్ని రోజులు పెరుగుతూ వచ్చిన బంగారం.. తాజాగా గురువారం స్వల్పంగా తగ్గుతూ బంగారం ప్రియులను ఆకర్షిస్తున్నాయి.

ఇక దేశీయంగా బంగారం ధరపై రూ.180 తగ్గి 22 క్యారెట్ల 10 గ్రాముల ధర ప్రస్తుతం రూ.45,770 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 46,950 ఉంది.

22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ..లలో

ఢిల్లీ – 45,900
ముంబై – రూ. 45,770
చెన్నై – 44,170
బెంగళూరు – 43,750
కోల్‌కతా – 46,220
హైదరాబాద్‌ – 43,750
విజయవాడ – 43,750

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ..లలో

ఢిల్లీ – 50,090
ముంబై – 46,770
చెన్నై – 48,170
బెంగళూరు – 47,730
కోల్‌కతా – 48,970
హైదరాబాద్‌ – 47,730
విజయవాడ- 47,730

ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూసే అంశాలు చాలా ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్‌ మార్కెట్‌ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్నబంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

Also Read: Silver Price Today: స్వల్పంగా పెరిగిన కిలో వెండి ధర.. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ధరల వివరాలు