విమల్ ఇలాచీ యాడ్ వివాదం.. బాలీవుడ్ స్టార్‌ హీరోలపై FDA కమిషనర్ కీలక వ్యాఖ్యలు!

విమల్ ఇలాచీ ప్రకటన పేరుతో నిషేదిక గుట్కా, పాన్ మసాలాను ప్రమోట్ చేస్తున్నారని బాలీహుడ్ స్టార్ హీరోస్‌కు ఇచ్చిన నోటీసులపై మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) కమిషనర్ తుకారాం ముంధే కీలక వ్యాఖ్యలు చేశారు. వాళ్లు స్టార్స్ అయిఉండోచ్చు కానీ.. తన దృష్టిలో చట్టాన్ని ఉల్లంఘించిన వారేనని తెలిపారు.

విమల్ ఇలాచీ యాడ్ వివాదం.. బాలీవుడ్ స్టార్‌ హీరోలపై FDA కమిషనర్ కీలక వ్యాఖ్యలు!
Bollywood Gutka Ad Controversy

Updated on: Sep 18, 2026 | 11:37 AM

నిషేదిత గుట్కా, పాన్‌ మసాలను ప్రమోట్ చేశారని బాలీహుడ్‌ స్టార్ట్ నలులపై ఆరోపణలు వచ్చిన విషయం అందిరికీ తెలిసిందే అయితే తాజాగా ఈ కేసుపై మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) కమిషనర్ తుకారాం ముంధే కీలక వ్యాఖ్యలు చేశారు. విమల్ ఇలాచీ ప్రకటన పేరుతో మహారాష్ట్రలో నిషేధించిన గుట్కా, పాన్ మసాలాను ప్రమోట్ చేస్తున్నారనే ఆరోపణలతో షారుఖ్ ఖాన్, అజయ్ దేవగణ్, టైగర్ ష్రాఫ్‌లకు ఆగస్టు 11న FDA నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు.

అయితే ఈ నోటీసులపై ప్రస్తుతం ఇద్దరు నలుటు మాత్రమే స్పందించి సమాధానం ఇచ్చారని.. ఈ బాధ్యత తమది కాదని, కేవలం తయారీదారులదేనని వారు తెలిపినట్టు ఆయన చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం ఆ ఇద్దరి వాదనలు వినడానికి FDA అధికారి సమయం కేటాయిస్తున్నారన్నారు. ఇక FDA నోటీసులకు రియాక్ట్ అవ్వని మరో నటుడిపై చట్టపరమైన విచారణ, ప్రాసిక్యూషన్ ప్రక్రియను FDA ప్రారంభించిందని తెలిపారు.

అలాగే ఆయన మరికొన్ని వ్యాఖ్యలు చేశారు. యాడ్‌లో నటించిన వారు స్టార్స్ కావచ్చు, కానీ చట్టం దృష్టిలో వారంతా కేవలం ప్రకటనకర్తలు మాత్రమేనని ఆయన అన్నారు. ఫుడ్ సేఫ్టీ యాక్ట్, 2018 నిబంధనల ప్రకారం ప్రచారం చేసే వస్తువుపై తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత నైతికంగానే కాక చట్టపరంగా కూడా అందులో నటించే వారిపై ఉందని ముంధే స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా ఎఫ్‌డీఏ ఇచ్చిన నోటీసులను రద్దు చేయాలని కోరుతూ విమల్ ఇలాచీకి చెందిన పీబీ ఆగ్రో ఎల్‌ఎల్‌పీ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ఆ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు అధికార పరిధి లేదంటూ కొట్టివేసినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై మీరు మహారాష్ట్ర కోర్టులను ఆశ్రయించాలని హైకోర్టు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us