Viral: పైనుంచి చూస్తే చెరుకు తోటే.. లోపలికెళ్లి చెక్ చేసిన పోలీసుల దిమ్మతిరిగిపోయింది

|

Jul 09, 2022 | 8:26 AM

'శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు' అన్న సామెతను నిజం చేస్తూ.. తమ పైత్యం చూపిస్తున్నారు కొందరు. చేసేది తప్పు అని తెలిసి కూడా.. తప్పించుకునేందుకు క్రియేటివిటీ వాడుతున్నారు.

Viral: పైనుంచి చూస్తే చెరుకు తోటే.. లోపలికెళ్లి చెక్ చేసిన పోలీసుల దిమ్మతిరిగిపోయింది
Sugarcane Field (representative image)
Follow us on

గంజాయి ఇప్పుడు యువత పాలిట పెను ప్రమాదంగా మారింది. మత్తుకు అలవాటు పడిపోయి బంగారం లాంటి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు కొందరు. దీంతో ప్రభుత్వాలు గంజాయి సహా ఇతర డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నాయి.  డ్రగ్స్ నియంత్రణ, నిషేధం కోసం ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేశాయి. ముఖ్యంగా అందరికీ ఈజీగా లభిస్తున్న గంజాయిని మూలాలతో సహా పెకిలించి వేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికలు రచించి మరీ ముందుకు వెళ్తున్నాయి. అయితే గంజాయి పండించేవారు, రవాణా చేసేవారు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ముందుకు సాగుతున్నారు. కొన్నిసార్లు జైలుకు వెళ్లి వచ్చినా సరే దందా వీడం అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. గంజాయి అక్రమ రవాణా కోసం పుష్ప సినిమాలో అల్లు అర్జున్ కంటే ఎక్కువ ఎత్తులు వేస్తున్నారు. దేశవ్యాప్తంగా రోజూ ఈ మాయదారి మత్తు పట్టుబడుతున్న ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా కర్ణాటక(karnataka)లోని గోకాక్ తాలూకాలోని హోనకుప్పి గ్రామం(Honakuppi village)లో చెరకు పంటల మధ్య గంజాయి మొక్కలను సాగుచేస్తున్న తండ్రీకొడుకులను కుల్గోడ్ పోలీసులు(Kulgod police) గురువారం అరెస్టు చేశారు. నిందితులు  బసప్ప రంగప్ప లగాడి, అతని కుమారుడు సిద్దప్పగా గుర్తించారు. వారు సాగు చేస్తున్న 95.1 కిలోల గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా చెరుకు తోట మధ్యలో వారు గంజాయి సాగు చేసినట్లు తెలిపారు. పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించి ఇద్దరిని పట్టుకున్నారు. తదుపరి విచారణ కొనసాగుతోంది.

అయితే గంజాయి వ్యాపారం చేసే బడాబాబులు పోలీసులకు చిక్కడం లేదు. డబ్బుకు ఆశపడి పండించే ఇలాంటి చిన్న, సన్నకారు రైతులు.. రవాణా చేసే పేద, మధ్యతరగతి వ్యక్తులు మాత్రమే పట్టుబడుతున్నారు. మెయిన్ లీడర్స్‌ని పట్టి కఠిన కేసులు పెట్టి లోపలేస్తే తప్ప ఈ జాఢ్యం పోయేలా లేదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.