Maharashtra: వీడసలు తండ్రేనా.. రీహార్సల్స్ చేద్దామని నమ్మించి.. ఏకంగా కూతురినే..

|

Nov 13, 2022 | 11:47 AM

పగతో రగిలిపోతున్న ఓ వ్యక్తి తన కూతురి పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. కూతురితోనే తాను చనిపోతున్నట్లు సూసైడ్ నోట్ రాయించి, ఉరి వేసి దారుణంగా చంపేశాడు. ముందుగా కుమార్తెను సూసైడ్ నోట్ రాసి, ఆపై ఆత్మహత్యగా..

Maharashtra: వీడసలు తండ్రేనా.. రీహార్సల్స్ చేద్దామని నమ్మించి.. ఏకంగా కూతురినే..
Crime
Follow us on

పగతో రగిలిపోతున్న ఓ వ్యక్తి తన కూతురి పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. కూతురితోనే తాను చనిపోతున్నట్లు సూసైడ్ నోట్ రాయించి, ఉరి వేసి దారుణంగా చంపేశాడు. ముందుగా కుమార్తెను సూసైడ్ నోట్ రాసి, ఆపై ఆత్మహత్యగా చూపించాలని కోరాడు. ఇదంతా కెమెరాలో రికార్డ్ చేస్తానని, దీనిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తే మంచి వ్యూస్, లైక్స్ వస్తాయని కూతుర్ని నమ్మించాడు. అతని మాటలు నమ్మిన ఆమె తండ్రి చెప్పిన విధంగా చేసింది. మొబైల్ కెమెరా ముందు ఉరి వేసుకున్నట్లు నటిస్తున్న సమయంలో అవకాశం కోసం ఎదురుచూస్తున్న తండ్రి స్టూల్ ను తన్నాడు. దీంతో కూతురి మెడకు ఉరి పడి ఆమె అక్కడికక్కడే మృత్యువాత పడింది. బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన నాగపూర్ పోలీసులు ఈ సంచలన విషయాలను కనుగొన్నారు. అతనిపై కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన నవంబర్ 6న జరిగినట్లు పోలీసులు తెలిపారు.16 ఏళ్ల బాలిక ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని అదుపులోకి తీసుకుని ఆమె సూసైడ్ నోట్ ఆధారంగా కేసు నమోదు చేసి బంధువులనూ అదుపులోకి తీసుకున్నారు.

దర్యాప్తు చేపట్టిన పోలీసులకు సరైన ఆధారాలు దొరకలేదు. బాలిక తండ్రి ప్రవర్తనపై అనుమానం రావడంతో అతడిని విచారించారు. అతని ఫోన్‌ను పరిశీలించగా మొత్తం వ్యవహారం బయటపడింది. ఈ ఘటనపై కలామ్నా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. బాలిక గదిలో మొత్తం ఐదు సూసైడ్ నోట్లు లభించాయి. అయితే ఈ సూసైడ్ నోట్‌ లు బాలిక రాయలేదని, ఎవరో రాసి ఉన్నట్టుగా అనుమానిస్తున్నారు. కానీ ఓ సూసైడ్ నోట్ మాత్రం ఆమె రాసినట్లు గుర్తించారు. యువతి ఆత్మహత్యకు యత్నిస్తున్న ఫొటో మొబైల్‌లో లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. విచారణలో నిందితుడు తన కుమార్తెను డ్రామా చేయమని అడిగాడని తేలింది. బాలిక ఉరివేసుకున్నట్లు రీహార్సల్స్ చేస్తున్న వెంటనే.. ఆమె ఫోటోను క్లిక్ చేసి స్టూల్‌ను తన్నాడు.

కొద్ది రోజుల క్రితం నిందితుడు రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో విబేధాలు రావడంతో ఈ ఘటనకు పాల్పడ్డాడని పోలీసులు చెబుతున్నారు. తన బంధువులను హెచ్చరించేందుకు నిందితుడు తన కుమార్తెను చంపాలని నిర్ణయించుకున్నాడు. ఆమెతో సూసైడ్ నోట్ రాయించి, రీహార్సల్స్ చేస్తున్నట్లు నమ్మించి దారుణంగా హత్య చేశాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..