Protest Against Protest: ఢిల్లీలో మళ్లీ టెన్షన్‌.. రైతులు సింఘు బోర్డర్‌ను వీడాలంటూ స్థానికుల ఆందోళన

|

Jan 28, 2021 | 4:16 PM

కొత్త వ్యవసాయ చ‌ట్టాల‌ను రద్దు చేయాలని రైతులు చేస్తున్న ఆందోళన ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తోంది. రైతులు సింఘు బోర్డర్‌ను ఖాళీ చేయాలని..

Protest Against Protest: ఢిల్లీలో మళ్లీ టెన్షన్‌.. రైతులు సింఘు బోర్డర్‌ను వీడాలంటూ స్థానికుల ఆందోళన
సింఘు బోర్డర్
Follow us on

Farmers protest: కొత్త వ్యవసాయ చ‌ట్టాల‌ను రద్దు చేయాలని రైతులు చేస్తున్న ఆందోళన ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తోంది. గణతంత్ర దినోత్సవం రోజున దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్‌ ర్యాలీ హింసాత్మకంగా మారింది. ఈ క్రమంలోనే తాజాగా గురువారం కూడా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సింఘు బోర్డర్‌ను ఖాళీ చేయాలని గురువారం వందలాది మంది స్థానికులు రోడ్డుపై ఆందోళన చేపట్టారు. రైతుల ఆందోళన వల్ల నానా ఇబ్బందులు పడుతున్నామని.. ఈ ప్రాంతాన్ని వీడాలంటూ ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకొని గ్రామస్తులు రోడ్డుపై నినాదాలు చేశారు.

అంతేకాకుండా రైతు సంఘాల నాయకులు రైతులను తప్పుదోవ పట్టించారని.. ట్రాక్టర్ల ర్యాలీలో పాల్గొన్నవారు రైతులు కాదంటూ వారంతా ఆందోళనకు దిగారు. జాతీయ పతాకాన్ని అవమానించారని వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. కాగా.. అంతకుముందు బుధవారం గ్రామస్తులు రోడ్లను ఖాళీ చేయాలంటూ నిరసనకారులకు 24 గంటల అల్టిమేటం జారీ చేశారు. ఇదిలాఉంటే.. స్థానికులు రోడ్డుపై దిగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. స్థానికులను సముదాయించి ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా సింఘు బోర్డర్‌లో భారీగా పోలీసులను మోహరించారు. రైతులు ఢిల్లీలోకి ప్రవేశించకుండా భారీగా బారీకేడ్లను ఏర్పటుచేస్తున్నారు.

Also Read:

Parliament of India: రాష్ట్రపతి ప్రసంగాన్ని బాయ్‌కాట్ చేస్తాం… 16 రాజకీయ పార్టీల సంయుక్త ప్రకటన..

Amit Shah: ఢిల్లీ అల్లర్లలో గాయపడిన పోలీసులను పరామర్శించిన హోంమంత్రి అమిత్ షా.. పరిస్థితులపై ఆరా