Farmers protest enters 71th day: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు ఉద్యమిస్తున్నారు. పలు ప్రాంతాల్లో చేపట్టిన ఈ ఆందోళన గురువారంతో 71వరోజుకు చేరింది. సింధు, ఘాజీపూర్, టిక్రీ తదితర ప్రాంతాల్లో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. రైతులు ఢిల్లీలోకి ప్రవేశించకుండా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అయితే ఈ ఆందోళనలకు రోజురోజుకు మద్దతు భారీగా పెరుగుతోంది. క్రమంగా రైతులు కూడా ఢిల్లీ సరిహద్దులకు చేరుకుంటూనే ఉన్నారు. కేంద్రం వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన తర్వాతే తిరిగి ఇళ్లకు వెళ్తామని రైతు సంఘాల నాయకులు స్పష్టం చేస్తున్నారు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల దృష్ట్యా సరిహద్దుల్లో సాయుధ దళాలను మోహరించారు. రహదారులపై బారీకేడ్లు, సిమెంట్ దిమ్మలు అడ్డుగా పెట్టి సరిహద్దులను పూర్తిగా మూసివేశారు. ఇదిలాఉంటే. జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజున జరిగిన హింసాకాండ అనంతరం కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ సరిహద్దుల్లో ఇంటర్‌నెట్ సేవలను నిలిపివేసింది. దీనికి నిరసనగా ఈనెల 6న ‘చక్కా జామ్’ పేరుతో మధ్యాహ్నం 12 గంటల నుంచి 3గంటల వరకు జాతీయ, రాష్ట్ర రహదారులు దిగ్బంధనం చేయాలని రైతు సంఘాలు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
Also Read: