Amit Shah: భారతదేశ ఐక్యతను ఏ ప్రచారం దెబ్బతీయలేదు: కేంద్ర హోంమంత్రి అమిత్ షా

|

Feb 04, 2021 | 12:59 PM

Amit Shah responds to Rihanna tweet : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు చేస్తున్న ఉద్యమానికి ప్రపంచంలోని పలువురు స్పందిస్తున్న సంగతి..

Amit Shah: భారతదేశ ఐక్యతను ఏ ప్రచారం దెబ్బతీయలేదు: కేంద్ర హోంమంత్రి అమిత్ షా
Follow us on

Amit Shah responds to Rihanna tweet : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు చేస్తున్న ఉద్యమానికి ప్రపంచంలోని పలువురు స్పందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాప్‌స్టార్ రిహాన్నా చేసిన ట్వీట్ సంచ‌ల‌నంగా మారింది. ఈ ట్విట్‌పై క్రీడాకారులు, సినీ ప్రముఖులు, రాజకీయ వేత్తలు స్పందిస్తున్నారు. రైతు ఆందోళనలపై అంతర్జాతీయ వ్యక్తుల జోక్యం అవసరం లేదంటూ విమర్శిస్తున్నారు. దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఘాటుగా స్పందించారు. రైతుల ధర్నాకు ప్రముఖుల మద్దతును ఖండిస్తూ అమిత్ షా ట్విట్ చేశారు.

‘‘భారతదేశ ఐక్యతను ఏ ప్రచారం దెబ్బతీయలేదన్నారు. కొత్త శిఖ‌రాల‌ను చేరుకునే భార‌త్‌ను ఏ ప్రచారం అడ్డుకోలేద‌ు. అభివృద్ధే దేశ భవిష్యత్‌ను నిర్ణయిస్తుంది.. ప్రగతిని సాధించేందుకు భార‌త్ ఐక్యంగా క‌లిసి ఉంటుంది’’ అంటూ హోంశాఖ మంత్రి అమిత్ షా ట్విట్ చేశారు.

ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళ‌న‌ల‌ను ఉద్దేశిస్తూ ఈనెల 2వ తేదీన పాప్ స్టార్ రిహాన్నా ట్విట్ చేసింది. సీఎన్ఎన్ వార్తా సంస్థ రాసిన క‌థ‌నాన్ని ట్వీట్‌ చేస్తూ.. దీని గురించి మ‌నం ఎందుకు మాట్లాడ‌డం లేదంటూ ఆమె ప్రశ్నించింది.

Also Read:

మరోసారి సామాన్యుడిపై గుదిబండ.. పెరిగిన గ్యాస్ ధర.. ఎంత పెరిగిందంటే..?

VK Sasikala: తమిళనాడులో వేడెక్కుతున్న రాజకీయాలు.. 7న చెన్నైకి రానున్న చిన్నమ్మ.. గ్రాండ్‌ వెల్‌కమ్‌‌కు సన్నాహలు..