AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెద్ద పాముతో ఆస్పత్రిలోకి ఎంట్రీ ఇచ్చిన వ్యక్తి..! ఎందుకో తెలిస్తే వావ్‌.. గ్రేట్‌ అంటారు

షాజహాన్‌పూర్‌లోని రైతు ముంతాజ్ అలీని పాము కాటేసింది. అతను పామును చంపి, దానిని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. వైద్యులు పామును గుర్తించి, సరైన విరుగుడు మందు ఇచ్చారు. ముంతాజ్ ధైర్యం అందరినీ ఆశ్చర్యపరిచింది. పాము కాటుకు తగిన చికిత్సను వెంటనే పొందడం చాలా ముఖ్యం.

పెద్ద పాముతో ఆస్పత్రిలోకి ఎంట్రీ ఇచ్చిన వ్యక్తి..! ఎందుకో తెలిస్తే వావ్‌.. గ్రేట్‌ అంటారు
Muntaj Ali
SN Pasha
|

Updated on: Jun 14, 2025 | 11:52 PM

Share

ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో తన తోటకు కాపలాగా ఉన్న రైతును పాము కాటేసింది. దాంతో ఆ రైతు కర్రతో కొట్టి పామును చంపాడు. వెంటనే తన భార్యతో కలిసి చనిపోయిన పాముతో ప్రభుత్వ వైద్య కళాశాలకు చేరుకున్నాడు. ఆసుపత్రికి చేరుకున్న వెంటనే వైద్యులు అతనికి చికిత్స ప్రారంభించారు. అయితే ఏ పాము కాటేసిందో తెలిస్తే.. దాని కంటే ప్రత్యేక మెడిసిన్‌ ఉంటుంది. అందుకే అతను తనను కాటేసిన పామును చంపి.. ఆస్పత్రి తీసుకొచ్చి.. తనను కాటేసిన పాము ఇదే అంటూ వైద్యులకు చూపించాడు. ఇది చూసి వైద్యులు ఆశ్చర్యపోయాడు.

షాజహాన్‌పూర్‌లోని కాంట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నవాడ గౌటియాకు చెందిన రైతు ముంతాజ్ అలీ తోటలో కాపలాదారుగా పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి కూడా ఆయన తోటకు కాపలాగా ఉన్నాడు. అకస్మాత్తుగా ఒక పొడవైన పాము అతని కాలును చుట్టుకుంది. ఆ తర్వాత అతనికి కాలుకు కాటేసి దగ్గర్లోని బొరియలోకి ప్రవేశిస్తుండగా.. దాని తోకను పట్టుకుని బయటకు లాగాడు. వెంటనే ఒక కర్ర అందుకొని దాన్ని కొట్టి చంపేశాడు. చనిపోయిన పామును ఇంటికి తీసుకెళ్లి తన భార్య నసీమకు ఈ విషయం చెప్పాడు.

పరిస్థితి విషమించడంతో ముంతాజ్ తన భార్యతో కలిసి పామును ఒక సంచిలో వేసుకుని ప్రభుత్వ వైద్య కళాశాలకు చేరుకున్నాడు, అక్కడ డాక్టర్ ముంతాజ్‌కు చికిత్స చేయడం ప్రారంభించాడు. ఈ సమయంలో అతని కాలు నుండి రక్తం కారుతోంది. ఆ తర్వాత అతని భార్య బ్యాగ్ నుండి చనిపోయిన పామును తీసి వైద్యుడికి చూపించింది. ఆ పాము చూసి.. దాని కాటుకు విరుగుడుగా పనిచేసే మందుతో వైద్యులు అతనికి చికిత్స అందించారు. ఇలా పాము కాటేసినా.. భయపడకుండా.. దాన్ని చంపి మరీ ఆస్పత్రికి తీసుకొచ్చిన అతని ధైర్యం చూసి అంతా షాక్‌ అయ్యారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఎమర్జెన్సీ అని వడ్డీలకు డబ్బులు తీసుకుంటున్నారా? జాగ్రత్త.
ఎమర్జెన్సీ అని వడ్డీలకు డబ్బులు తీసుకుంటున్నారా? జాగ్రత్త.
అతనిని బాగా నమ్మి మోసపోయా.. బ్రేకప్ స్టోరీ చెప్పిన అనన్య నాగళ్ల
అతనిని బాగా నమ్మి మోసపోయా.. బ్రేకప్ స్టోరీ చెప్పిన అనన్య నాగళ్ల
కొబ్బరికాయ కొట్టినప్పుడు అందులో పువ్వు వస్తే మంచిదేనా.? 99% మంది
కొబ్బరికాయ కొట్టినప్పుడు అందులో పువ్వు వస్తే మంచిదేనా.? 99% మంది
చావో రేవో తేల్చుకోనున్న చెన్నై.. టాప్ 2 కోసం గిల్ సేన గురి
చావో రేవో తేల్చుకోనున్న చెన్నై.. టాప్ 2 కోసం గిల్ సేన గురి
భారత్ ఖనిజాల హబ్‌గా ఆ రాష్ట్రం? బంగారం కన్నా విలువైన నిధి లభ్యం!
భారత్ ఖనిజాల హబ్‌గా ఆ రాష్ట్రం? బంగారం కన్నా విలువైన నిధి లభ్యం!
ఈవీలు కొనండి.. క్యాష్ పొందండి.. ఉద్యోగులకు ఆ కంపెనీ బంపర్ ఆఫర్
ఈవీలు కొనండి.. క్యాష్ పొందండి.. ఉద్యోగులకు ఆ కంపెనీ బంపర్ ఆఫర్
భారత బిలియనీర్లు తమ డబ్బును ఎందులో పెట్టుబడి పెడ్తున్నారో తెలుసా?
భారత బిలియనీర్లు తమ డబ్బును ఎందులో పెట్టుబడి పెడ్తున్నారో తెలుసా?
పాక్‌తోపాటు భారత్‌కు షాకిచ్చిన బంగ్లా.. ఫైనల్ ఆడేది ఆ 2 జట్లే?
పాక్‌తోపాటు భారత్‌కు షాకిచ్చిన బంగ్లా.. ఫైనల్ ఆడేది ఆ 2 జట్లే?
స్నేక్ క్యాచర్‌కే చుక్కలు చూపించిన బిగ్‌ పైథాన్
స్నేక్ క్యాచర్‌కే చుక్కలు చూపించిన బిగ్‌ పైథాన్
ఆ హీరో చాలా గొప్పవ్యక్తి..
ఆ హీరో చాలా గొప్పవ్యక్తి..