పెళ్లి బరాత్ లో కురిసిన డబ్బు వర్షం.. అన్నీ రూ. 500,200,100 నోట్లే.. అందుకునేందుకు ఎగబడిన జనం.. కట్‌చేస్తే..

|

Nov 20, 2024 | 11:43 AM

ఇంత భారీ మొత్తంలో డబ్బు వెదజల్లుతున్నారు.. అదంతా ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై విచారణ జరిపించాలని మరొకరు రాశారు. ఏదైనా స్వచ్ఛంధ సంస్థలకు ఈ డబ్బు కూడా విరాళంగా ఇవ్వొచ్చని మరొకరు రాశారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని, ఇంత పెద్ద మొత్తంలో డబ్బు వెదజల్లడం సరైనది కాదంటూ మరొకరు రాశారు. చివరకు వీడియో పోలీసులకు చేరింది.

పెళ్లి బరాత్ లో కురిసిన డబ్బు వర్షం.. అన్నీ రూ. 500,200,100 నోట్లే.. అందుకునేందుకు ఎగబడిన జనం.. కట్‌చేస్తే..
Throwing Notes At A Wedding
Follow us on

పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. నవంబరు, డిసెంబరు నెలల్లోనే 48 లక్షల వివాహాలు జరగనున్నాయని అంచనా వేస్తున్నారు. ఇన్ని వివాహాలు జరిగినప్పుడు, కొన్ని ఆసక్తికరమైన, షాకింగ్ ఘనలు ఖచ్చితంగా వెలుగులోకి వస్తాయి. అటువంటి షాకింగ్‌ సంఘటన ఒకటి సోషల్ మీడియా వేదికగా వెలుగులోకి వచ్చింది. ఇక్కడ జరిగిన ఓ పెళ్లి ఊరేగింపుకు సంబంధించిన వీడియో నెట్టింట తీవ్ర దుమారాన్ని రేపింది. పెళ్లి బరాత్‌ సందర్భంగా కుటుంబ సభ్యులు పెద్ద మొత్తంలో కరెన్సీ నోట్లను వెదజల్లారు. దాంతో పోలీసులు రంగంలోకి దిగారు. చివరకు ఏం జరిగిందో తెలియాలంటే పూర్తి స్టోరీలోకి వెళ్లాల్సిందే..

ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్‌లో జరిగిన ఓ పెళ్లి ఊరేగింపు వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. సిద్ధార్థనగర్‌లోని దేవల్వా గ్రామంలో ఓ పెళ్లి సందర్భంగా తీసిన వీడియో ఇది. ప్రస్తుతం ఈ వీడియో సర్వత్రా చర్చనీయాంశమైంది. దీనికి కారణం పెళ్లి ఊరేగింపులో ఆ కుటుంబీకులు చేసిన హడావుడి.. పెళ్లి బరాత్‌ సందర్భంగా వారు దాదాపు ఇరవై లక్షల రూపాయల నోట్ల కట్టలు గాలిలోకి వెదజల్లారు. పెళ్లి ఊరేగింపులో పాల్గొన్న వ్యక్తులు కొందరు ఇంటి పైకప్పు, జేసీబీలపైకి ఎక్కి మరీ కరెన్సీ నోట్ల కట్టలను గాలిలోకి విసిరారు. ఇదంతా కొందరు వీడియోను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్‌ చేయగా ఇప్పుడు అది వైరల్ అవుతోంది. వీడియోలో చాలా మంది గాలిలోకి నోట్లు విసురుతున్నట్లు కనిపిస్తోంది. 100, 200, 500 రూపాయల నోట్లను గాలిలోకి విసిరినట్లు సమాచారం. ఇందుకోసం వారు జేసీబీని కూడా పిలిపించారు. కొందరు దానిపై నిలబడి, మరికొందరు బిల్డిండ్‌పై పైకప్పుపై నిలబడి కరెన్సీ నోట్లను జల్లుతున్నారు.. ఈ నోట్లను సేకరించేందుకు చాలా మంది తరలివచ్చారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఇక వీడియో చూసిన నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్‌ చేశారు. అతను అంత పెద్ద దాత అయితే, కొంతమంది పేద అమ్మాయిలకు పెళ్లిళ్లు చేసి ఉండాలి. లేదంటే, పేదలకు సాయం చేయొచ్చు కదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత భారీ మొత్తంలో డబ్బు వెదజల్లుతున్నారు.. అదంతా ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై విచారణ జరిపించాలని మరొకరు రాశారు. ఏదైనా స్వచ్ఛంధ సంస్థలకు ఈ డబ్బు కూడా విరాళంగా ఇవ్వొచ్చని మరొకరు రాశారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని, ఇంత పెద్ద మొత్తంలో డబ్బు వెదజల్లడం సరైనది కాదంటూ మరొకరు రాశారు. చివరకు వీడియో పోలీసులకు చేరింది. దీంతో అవసరమైన చర్యలు తీసుకోవాలని సిద్ధార్థనగర్ పోలీస్ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ని ఆదేశాలు వచ్చినట్టుగా అధికారులు తెలిపారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..