దేశంలో కోవిడ్ విజృంభిస్తోంది. కోవిడ్ పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌లో కోవిడ్-19 మరణాలకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) పేరిట ఓ వీడియో వైరల్ అవుతోంది. ఏప్రిల్ 15నాటికి దేశంలో కోవిడ్ మరణాల సంఖ్య 50 వేలకు చేరుతుందన్నది ఆ వైరల్ వీడియో సారాంశం. ఈ వీడియోపై ఇటు మీడియా వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. దీనిపై వివరణ ఇచ్చిన WHO ఆగ్నేయాసియా ప్రాంతీయ కార్యాలయం..ఈ వైరల్ వీడియో ఫేక్‌గా తేల్చేసింది. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఈ వీడియోతో తమకు ఎలాంటి సంబంధంలేదని స్పష్టంచేసింది. ఏప్రిల్ 15కల్లా భారత్‌లో కోవిడ్ మరణాల సంఖ్య 50 వేలకు చేరుతుందన్నట్లు తాము ఎలాంటి హెచ్చరిక వీడియోను విడుదల చేయలేదని…ఇది ఫేక్ న్యూస్‌గా స్పష్టంచేసింది.
మరో నాలుగైదు రోజులు అత్యంత కీలకమని…కోవిడ్ మూడో స్టేజ్‌కి చేరితే, అధిక జనాభా కలిగిన భారత్‌లో మరణాల సంఖ్య 50 వేలకు చేరుతుందని ఆ వీడియోలో ఉంది. ఈ ఫేక్ వీడియోను WHO, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్(ICMR) పేరిట విడుదల చేశారు.
A video claiming @WHO has warned of 50,000 #COVID-19 deaths in India by 15 April is FAKE NEWS.
WHO has NOT issued any such warning. #IndiaFightsCorona #pandemic @MoHFW_INDIA @PIB_India @ICMRDELHI @ANI
— WHO South-East Asia (@WHOSEARO) April 6, 2021
ఈ ఫేక్ వీడియో వాస్తవానికి గత ఏడాది మార్చి, ఏప్రిల్ మాసాల్లోనే సోషల్ మీడియాలో దర్శనమిచ్చినట్లు తెలుస్తోంది. సెకండ్ వేవ్ నేపథ్యంలో ఇప్పుడు మరోసారి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఇవి కూడా చదవండి..Hen Fight With Snake: పిల్లలను కాపాడుకోవడం కోసం పాముతో ప్రాణాలను లెక్కచేయకుండా పోరాడిన కోడి
ఇంటి గుమ్మంలో తిష్టవేసిన సింహాలు.. డోర్ తీసి కంగుతిన్న యజమాని.. కట్ చేస్తే ఊహించని సంఘటన.!