Enforcement Directorate: విజయ్‌ మాల్యా, నీరవ్‌, చోక్సీలకు చెందిన రూ. 9,371 కోట్ల ఆస్తులు బ్యాంకులకు బదిలీ

Enforcement Directorate: భారత్‌లో బ్యాంకులను మోసగించి విదేశాలకు పారిపోతున్నవారి సంఖ్య పెరిగిపోతోంది. లలిత్‌ మోదీ,, విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సీ..

Enforcement Directorate: విజయ్‌ మాల్యా, నీరవ్‌, చోక్సీలకు చెందిన రూ. 9,371 కోట్ల ఆస్తులు బ్యాంకులకు బదిలీ
Vijay Mallya, Nirav Modi And Mehul Choksi
Follow us

|

Updated on: Jun 23, 2021 | 1:39 PM

Enforcement Directorate: భారత్‌లో బ్యాంకులను మోసగించి విదేశాలకు పారిపోతున్నవారి సంఖ్య పెరిగిపోతోంది. లలిత్‌ మోదీ,, విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సీ.. ఇలా స్వదేశంలో రూ.వేల కోట్లు కొల్లగొట్టి ఇతర దేశాల్లో తలదాచుకుంటున్నవారిని వెనక్కి రప్పించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. వ్యవస్థలో లోపాలను ఆసరాగా చేసుకొని దర్యాప్తు సంస్థలతో దోబూచులాడుతున్న ఇలాంటి నేరగాళ్ల ఆట కట్టించలేకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి అద్దం పడుతోంది.

అయితే బ్యాంకులను మోసగించి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాళ్లు విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సి వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముగ్గురికి చెందిన రూ. 9,371 కోట్ల ఆస్తులను బ్యాంకులకు బదిలీ చేసింది ఈడీ. ముగ్గురూ కలిసి బ్యాంకుల నుంచి రూ. 22,585.83 కోట్లు రుణాలు తీసుకున్నారు. అయితే ముగ్గురుకు చెందిన స్థిరాస్థుల నుంచి రూ. 18,170.02 కోట్ల మేర ఆస్తులను అటాచ్ చేసి ఈడీ.. ఇందులో రూ. 969 కోట్ల మేర విదేశీ ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బ్యాంకులను మోసగించిన మొత్తం సొమ్ము నుంచి 80.45% వరకు సీజ్ చేసింది. రుణాలు, పన్నుల ఎగవేతపై సీబీఐ, ఈడీ, ఇన్‌కంట్యాక్స్ సంస్థల దర్యాప్తు కొనసాగుతోంది. అయితే విదేశాలకు పారిపోయి తలదాచుకున్న ముగ్గురు నిందితులు.. విదేశాల నుంచి నిందితులను రప్పించేందుకు దర్యాప్తు సంస్థల ముమ్మర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

అయితే డమ్మి సంస్థలతో ఈ ముగ్గురు బ్యాంకుల నుంచి భారీ మొత్తంలో రుణాలు తీసుకున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తెలిపింది. విజయ్‌ మాల్యాను అప్పగించేందుకు బ్రిటన్‌ కోర్టు అంగీకరించింది. ముగ్గురికి చెందిన ఆస్తులను త్వరలో వేలం వేయనున్నారు. దాని ద్వారా ఆయా బ్యాంకులకు సుమారు రూ.7981 కోట్లు జమ అయ్యే అవకాశాలున్నాయి.

సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ) నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. బ్యాంకులు ఇచ్చిన నిధులను తమ కంపెనీల ద్వారా వీరు రొటేషన్, దారి మళ్లింపులకు పాల్పడినట్లు ఎఫ్ఐఆర్‌లు పేర్కొంటున్నాయి. అయితే ఈ ముగ్గురినీ తిరిగి భారత్‌కు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు ఈడీ పేర్కొంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం దర్యాప్తు పూర్తి కాగానే ఈ ముగ్గురినీ మన దేశానికి రప్పించడానికి బ్రిటన్, ఆంటిగ్వా, బార్బుడాలకు విజ్ఞప్తి చేసినట్లు పేర్కొంది.

అయితే నీరవ్ మోదీ, విజయ్ మాల్యా పరారైన ఆర్థిక నేరగాళ్ళు అని ముంబైలోని మనీలాండరింగ్ నిరోధక న్యాయస్థానం తెలిపింది. ఇదిలావుండగా, విజయ్ మాల్యాను బ్రిటన్ నుంచి మన దేశానికి రప్పించేందుకు మార్గం సుగమం అవుతోంది. భారత దేశానికి అప్పగించడానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో అపీలు చేయడానికి మాల్యాకు అనుమతి లభించలేదు.

Ed

PR Mallya, Nirav and Mehul 23.06.21 final

ఇవీ కూడా చదవండి

టీటీడీ వ‌ద్ద ఉన్న రూ.49.70కోట్ల పాత‌నోట్ల‌ను నిర్వీర్యం చేయానుందా?.. కేంద్రం నుంచి ఎలాంటి సమాధానం వస్తోంది

Jet Airways: ఈ ఏడాది చివరిలో మళ్లీ కార్యకలాపాలు సాగించనున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానాలు..!

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో