Naxalites Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్.. 11 మంది మావోయిస్టులు మృతి! కొనసాగుతున్న ఆపరేషన్‌..

|

Jul 02, 2024 | 7:55 PM

ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లా కుర్రేవాయ్ అటవీప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో 11 మంది మావోయిస్టులు మృతి చెందారు. నారాయణపూర్ జిల్లా దండకారణ్యంలో మావోయిస్టుల కోసం పోలీసులు జల్లెడ పడుతున్న సంగతి తెలిసిందే. అబూజ్మడ్ దండకారణ్యంలో మావోయిస్టుల శిబిరాల సెర్చింగ్ చేసేందుకు 1400 మంది జవాన్లను మోహరింప..

Naxalites Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్.. 11 మంది మావోయిస్టులు మృతి! కొనసాగుతున్న ఆపరేషన్‌..
Naxalites Encounter In Chhattisgarh
Follow us on

ఛత్తీస్‌గఢ్‌, జులై 1: ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లా కుర్రేవాయ్ అటవీప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో 11 మంది మావోయిస్టులు మృతి చెందారు. నారాయణపూర్ జిల్లా దండకారణ్యంలో మావోయిస్టుల కోసం పోలీసులు జల్లెడ పడుతున్న సంగతి తెలిసిందే. అబూజ్మడ్ దండకారణ్యంలో మావోయిస్టుల శిబిరాల సెర్చింగ్ చేసేందుకు 1400 మంది జవాన్లను మోహరింప జేశారు. ఈ క్రమంలో కూంబింగ్‌ నిర్వహిస్తున్న భద్రతాబలగాలకు మావోయిస్టులు మధ్య ఎదురుపడటంతో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో 11 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఈ విషయాన్ని నారాయణపూర్‌ ఐజీ సంజయ్‌ రాజ్‌ మీడియాకు తెలిపారు.

ఐజీ తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో అంబూజ్‌మడ్‌లోని కోహ్‌కామెటా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో భద్రతాబలగాలు కూంబింగ్‌ నిర్వహించాయి. అవతలివైపు నుంచి కాల్పులు మొదలవడంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో పోలీసులు, నక్సలైట్ల మధ్య మంగళవారం మధ్యాహ్నం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి.

భద్రతా సిబ్బంది సురక్షితంగా ఉన్నారని ఆయన చెప్పారు. జిల్లా రిజర్వ్ గార్డ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మరియు వివిధ జిల్లాలకు చెందిన ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులతో కూడిన ఈ ఆపరేషన్ సోమవారం ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.