ఏనుగు దాడిలో ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్ మృతి

| Edited By:

Aug 15, 2020 | 1:14 PM

మధ్యప్రదేశ్‌లో విషాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని పన్నా పులుల అభయారణ్యంలో ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. ఓ ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌పై దాడి చేసి హతమార్చింది. వివరాల్లోకి..

ఏనుగు దాడిలో ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్ మృతి
Follow us on

మధ్యప్రదేశ్‌లో విషాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని పన్నా పులుల అభయారణ్యంలో ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. ఓ ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌పై దాడి చేసి హతమార్చింది. వివరాల్లోకి వెళితే.. పన్నా అడవిలో ట్రాకింగ్‌ ఆపరేషన్‌లో భాగంగా విధులు నిర్వర్తిస్ఉన్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఆర్ కె భగత్‌ వెళ్లారు. అయితే అడవిలో రెండు పులులు పోట్లాడుకున్నాయి. అందులో ఓ పులి మరణించింది. అయితే దీనిపై ఆరా తీసేందుకు అడవిలోకి వెళ్లిన భగత్‌ను రామ్ బహదూర్‌ అనే ఓ ఏనుగు తన దంతంతో పొడిచి చంపిందని అటవీ శాఖ అధికారి తెలిపారు. బాధిత అధికారి అడవిలో సంచరిస్తున్న సమయంలో వెనున నుంచి వచ్చిన ఏనుగు అతడిని తన దంతంతో పొడిచి దాడికి దిగింది. ఈ క్రమంలో రేంజ్ ఆఫీసర్ భగత్‌ అక్కడికక్కడే మృతిచెందారు.

Read More :

16 వేల అడుగుల ఎత్తులో రెపరెపలాడిన జాతీయ జెండా

అసోం వరదల బీభత్సం.. 112కి చేరిన మృతులు