Electricity Bill 2021: ఈ బిల్లుతో కరెంట్ చార్జీలు మీ జేబులు ఖాళీ చేస్తాయి.. అయినా ఫర్వాలేదు అంటున్న ప్రభుత్వం ఎందుకంటే..

|

Dec 02, 2021 | 7:07 PM

మేం అధికారంలోకి వస్తే కరెంట్ బిల్లులు మాఫీ చేస్తాం.. కరెంట్ బిల్లులు తగ్గించేస్తాం లాంటి వాగ్దానాలు వచ్చే ఎన్నికల్లో కనిపించే అవకాశం లేదు. ఎందుకంటే, విద్యుత్ సవరణ బిల్లు 2021 అటువంటి వాగ్దానాలకు అవకాశం ఇవ్వదు.

Electricity Bill 2021: ఈ బిల్లుతో కరెంట్ చార్జీలు మీ జేబులు ఖాళీ చేస్తాయి.. అయినా ఫర్వాలేదు అంటున్న ప్రభుత్వం ఎందుకంటే..
Electricity Emendment Bill 2021
Follow us on

Electricity Amendment Bill 2021: మేం అధికారంలోకి వస్తే కరెంట్ బిల్లులు మాఫీ చేస్తాం.. కరెంట్ బిల్లులు తగ్గించేస్తాం లాంటి వాగ్దానాలు వచ్చే ఎన్నికల్లో కనిపించే అవకాశం లేదు. ఎందుకంటే, విద్యుత్ సవరణ బిల్లు 2021 అటువంటి వాగ్దానాలకు అవకాశం ఇవ్వదు. ఈ శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం.. ఈ చట్టం అమలులోకి తీసుకు వచ్చిన తర్వాత ప్రభుత్వాలు విద్యుత్ కంపెనీలకు రాయితీలు ఇవ్వలేవు. ఇప్పుడు ఈ సబ్సిడీ నేరుగా వినియోగదారుల ఖాతాలో అంటే ప్రజల ఖాతాలో జమ అవుతుంది. ఈ బిల్లు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ బిల్లు ముఖ్య ఉద్దేశ్యం మీరు పూర్తి విద్యుత్ బిల్లును చెల్లించాలి. దీని తరువాత, ప్రభుత్వం మీ ఖాతాలో సబ్సిడీ డబ్బును జమ చేస్తుంది. అంటే, వంట గ్యాస్ విషయంలో ఎటువంటి విధానం ఉందో దాదాపు అటువంటి పధ్ధతి ఇప్పుడు కరెంట్ బిల్లుల విషయంలో వస్తుంది. వాస్తవానికి వినియోగదారుల నుంచి తీసుకునే బిల్లు కంటే విద్యుత్‌ సంస్థలు అధికంగా ఖర్చు చేస్తున్నాయి. అంటే నష్టాలు చవిచూసినా విద్యుత్ సంస్థలు తక్కువ ధరకే కరెంటు ఇస్తాయి. అయితే ఈ నష్టాన్ని ప్రభుత్వ సబ్సిడీ ద్వారా భర్తీ చేస్తారు.

విద్యుత్ సవరణ బిల్లు 2021లోని ముఖ్యమైన అంశాలు ఇవే..

(1) ఇప్పటివరకూ రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ పంపిణీ సంస్థలకు సబ్సిడీ ఇస్తాయి. దీని తర్వాత కంపెనీలు విద్యుత్ రేట్లను నిర్ణయిస్తాయి. ఇప్పుడు ప్రభుత్వం ఈ సబ్సిడీని నిలిపివేస్తే ఏమవుతుంది? దీని ప్రభావం విద్యుత్ ధరలపైనా పడనుంది.

(2) మీ ఇంటికి విద్యుత్ సరఫరా చేసే కంపెనీలు తాము భారీ నష్టాల్లో ఉన్నామని క్లెయిమ్ చేస్తున్నాయి. పీఐబీ(PIB) నివేదిక ప్రకారం, 2020-21 ఆర్థిక సంవత్సరంలో డిస్కమ్‌లు మొత్తం 90,000 కోట్ల రూపాయల నష్టాన్ని కలిగి ఉంటాయని అంచనా.

(3) ప్రభుత్వం ద్వారా సబ్సిడీ ఆలస్యం అవుతుంది. దీని ప్రభావం విద్యుత్ పంపిణీ సంస్థలపై కూడా పడుతుంది. ఇప్పుడు కొత్త విధానం అమల్లోకి వస్తే కంపెనీలు ధరలను పెంచే అవకాశం ఉంది. అప్పుడు దాని పూర్తి ప్రభావం మీ జేబుపై ఉంటుంది. అయితే, మీ ఖాతాలో నేరుగా సబ్సిడీని ఇవ్వడం ద్వారా ప్రభుత్వం దానిని భర్తీ చేస్తుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లును రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది తమపై పెను ప్రభావం చూపుతుందని రైతు సంఘాలు భావిస్తున్నాయి.ఇక ఈ సెషన్‌లో ప్రభుత్వం ఈ బిల్లును ఆమోదింపజేసుకోగలుగుతుందా.. లేదా అనేది వేచి చూడాలి.

(4) కొత్త చట్టంతో కొన్ని సవాళ్లు ఉన్నాయి . భూమి యజమాని, యజమాని, దుకాణం పేరు మీద కనెక్షన్ ఉంది. కౌలుదారు విషయంలో ఎవరికి రాయితీ వస్తుందో స్పష్టత లేదు.

విద్యుత్ వినియోగాన్ని బట్టి సబ్సిడీని నిర్ణయిస్తారు. కాబట్టి 100% మీటరింగ్ అవసరం. చాలా రాష్ట్రాల్లో మీటర్ లేకుండానే కరెంటు ఇస్తున్నారు. మహారాష్ట్రలో 15 లక్షల మంది వ్యవసాయ వినియోగదారులు మీటర్ లేకుండా విద్యుత్ పొందుతున్నారు. మొత్తం వ్యవసాయ వినియోగదారులలో వీరు 37%. సబ్సిడీ బదిలీలో జాప్యం జరిగితే వినియోగదారులు ఇబ్బంది పడతారు. ‘PRS లెజిస్లేటివ్ రీసెర్చ్’ ప్రకారం, వ్యవసాయ వినియోగదారుని సగటు నెలవారీ బిల్లు 5 వేల వరకు ఉంటుంది. ఇప్పుడు ఉచిత కరెంటు పొందుతున్న వారికి ఈ మొత్తం భారీగానే ఉంటుంది.

ఇవి కూడా చదవండి: Indian Railways: ఆ రెండు రాష్ట్రాల మీదుగా వెళ్ళే 100 రైళ్ళను రద్దు చేసిన భారతీయ రైల్వే.. ఎందుకంటే..

Corona Kavach: ఒమిక్రాన్ వణికిస్తోంది.. కరోనా సోకితే ఈ పాలసీతో వైద్య ఖర్చులకు ఇబ్బంది ఉండదు.. ఎలానో తెలుసుకోండి!

Maruti Suzuki: ఇకపై మారుతీ కారు కొనాలంటే షాకే.. భారీగా పెరగనున్న ధరలు.. ఎప్పటినుంచి అంటే..