
Lok Sabha Election 2024: లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ఏర్పాట్లు పూర్తి చేస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. ఒక వైపు పోటీలో ఉండే అభ్యర్థుల ఖర్చు, ఎన్నికల నిర్వహణ, విధులు నిర్వహించే ఉద్యోగులకు ట్రైనింగ్ సెషన్‌లతో బిజీగా ఉన్న ఎన్నికల సంఘం.. తక్కువ ఓటింగ్ నమోదు అవుతున్న ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. గత 2019 సాధారణ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా తక్కువ ఓటు శాతం నమోదు అయినా నియోజకార్గాలను గుర్తించింది. దేశ వ్యాప్తంగా ఎలాగైనా ఓటింగ్ శాతం పెంచడానికి ప్రత్యేక కార్యాచరణ ను సిద్దం చేస్తోంది ఎలక్షన్ కమీషన్.
ప్రజల తలరాతను మార్చే ఆయుధం ఓటు. ఓటు వేసే వయసు వచ్చిన ఓటు వేయడానికి ముందుకు రానివారు చాలా మంది ఉన్నారు. దీని వల్ల చాలా ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదవుతోంది. ఇలా దేశ వ్యాప్తంగా తక్కువ ఓటింగ్ నమోదు అవుతున్న ప్రాంతాలను దాదాపు రెండు వందల నియోజకవర్గాలను గుర్తించింది సెంట్రల్ ఎన్నికల కమిషన్. ఇందులో టాప్ 50 జాబితా విడుదల చేసి, ఆ ప్రాంతాల్లో ఎందుకు తక్కువ ఓటింగ్ నమోదు అవుతుందో వివరాలు తెలపాలంటూ అన్ని రాష్ట్రాల ఎన్నికల అధికారులకు సూచన చేసింది. 2019 ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా 67.40శాతం ఓటింగ్ జరగగా, ఇంత కన్నా తక్కువ ఓటింగ్ శాతం నమోదు అయినా రాష్ట్రాలను వివరాలు అడిగింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇందులో తెలంగాణ రాష్ట్రంలో నాలుగు పార్లమెంట్ నియోజక వర్గలలో తక్కువగా పోలింగ్ నమోదు అయినట్టు గుర్తించింది ఈసీ. 2019 లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్ ఓటింగ్ శాతం 44.84,సికింద్రాబాద్ ఓటింగ్ శాతం 46.50%, మల్కాజిగిరి 49.63%, చేవెళ్ల 53.25% ఓటింగ్ నమోదు అయింది.
ముఖ్యంగా ఓటింగ్ పట్ల యువతలో ఉన్న అశ్రద్ధ, రోజువారి పని చూసుకుంటూ సంపాదన చేసే వారు, పోలింగ్ రోజున సెలవు ఇచ్చినప్పటికీ పనికి వెళ్లడం, ఒకే కుటుంబంలోని ఓటర్లను వేర్వేరు పోలింగ్ బూతులకు కేటాయించడం, అంతర్గత వలసలు, క్యూలో వెయిట్ చేయడం లాంటి కారణాలతో తక్కువ ఓటింగ్ కు కారణమని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు రాష్ట్ర ఎన్నికల కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. అయితే ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు విస్తృతంగా ప్రచారంతోపాటు, ఓటర్లను ముఖ్యంగా యువతను భాగస్వాములను చేసేలా ప్రత్యేక కార్యాచరణ రెడీ చేసుకోవాలని, తక్కువ శాతాలు నమోదు కావడానికి ఏదైనా నిర్దిష్ట సమస్య ఉంటే కమిషన్ దృష్టికి తీసుకురావాలని కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది.
మన దేశంలో ప్రస్తుతం 18 ఏళ్లు వయస్సు ఉన్న యువతీయువకులు దాదాపు 5 కోట్ల మంది ఉన్నారు. వీరందరికీ ఓటర్‌గా నమోదు చేసుకునే వయసు వచ్చినప్పటికీ కేవలం రెండు కోట్ల మంది యువత మాత్రమే ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకున్నారు. అంటే ఓటేసే వయసు వచ్చినప్పటికీ కేవలం 38 శాతం మంది మాత్రమే ఓటు హక్కు పొందారు. ఓటు అవకాశాన్ని మాత్రం యువత ఉపయోగించుకోవడం లేదనేదీ తాజా లెక్కలు చెబుతున్నాయి.
దేశంలో 18 ఏళ్ల యువత ఎక్కువగా ఓటర్లుగా నమోదైన రాష్ట్రాల్లో తెలంగాణనే మొదటి స్థానంలో ఉంది. తెలంగాణలో 18 ఏళ్ల వయసు వారు 12 లక్షల మంది ఉండగా దాదాపు 8 లక్షల మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. తర్వాత జమ్మూ కాశ్మీర్ 62%, హిమాచల్ ప్రదేశ్ 60 శాతం,అతి తక్కువగా బీహార్‌లో ఓటు హక్కు వయసు వచ్చిన నమోదు చేసుకున్నది కేవలం 17 శాతం మంది మాత్రమే. బీహార్‌లో 54 లక్షల మంది ఉంటే కేవలం 9 లక్షల మంది మాత్రమే ఓటర్ జాబితాలో ఉన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో కూడా కేవలం 21 శాతం మంది నమోదు చేసుకున్నారు అని లెక్కలు చెబుతున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…