Telugu News India News Election Commission of India Press conference telugu live updates announces Poll schedule for Kerala, Tamil Nadu, West Bengal, Assam, Puducherry
Election Commission Live Updates: 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్.. ఎన్నికలు ఎప్పుడంటే..?
Election Commission Press Conference Live Updates in Telugu : 5 రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ రిలీజ్ చేసింది. అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే విడతలో పోలింగ్ జరగనుంది.
మరికొన్ని గంటల్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ రాబోతోంది. పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళం, అసోం, పుదుచ్చేరిలో ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను సాయంత్రం 4 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది. ఈ ఐదు రాష్ట్రాల్లోనూ ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ జరిగింది. ఎన్నికల సన్నద్ధతపై ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో పర్యటించారు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్. ఈ దఫా పశ్చిమబెంగాల్‌లో మరిన్ని చర్యలు తీసుకోబోతోంది కేంద్ర ఎన్నికల సంఘం. 2021లో 294 నియోజకవర్గాలకు గాను 160 మంది సాధారణ పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం.. — ఈ సారి ప్రతి నియోజకవర్గానికి ఒక సాధారణ పరిశీలకుడిని నియమించబోతోంది ఎన్నికల సంఘం.
పశ్చిమ బెంగాల్‌లో మే 7న.. తమిళనాడులో మే 10న.. అసోంలో మే 20న.. కేరళంలో మే 23న.. పుదుచ్చేరిలో జూన్ 15న అసెంబ్లీ పదవికాలం ముగియనుంది. దీంతో.. ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణకు ఇవాళ డేట్స్ ఫిక్స్ చేయనుంది కేంద్ర ఎన్నికల సంఘం.
LIVE NEWS & UPDATES
The liveblog has ended.
15 Mar 2026 05:22 PM (IST)
సీపీఐ, సీపీఎం అభ్యర్థుల ప్రకటన
ఎన్నికల షెడ్యూల్ విడుదలతో అభ్యర్థుల ప్రకటనపై పార్టీల ఫోకస్
గోవా, కర్ణాటక, నాగాలాండ్, త్రిపురలలో ఏప్రిల్ 9న ఎన్నికలు
మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో ఏప్రిల్ 23న ఉపఎన్నికల పోలింగ్
15 Mar 2026 04:52 PM (IST)
తమిళనాడులో మార్చి 30 నుంచి నామినేషన్లు
తమిళనాడులో మార్చి 30 నుంచి నామినేషన్లు
నామినేషన్ల దాఖలు ప్రారంభం – మార్చి 30
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ – ఏప్రిల్ 6
నామినేషన్ల పరిశీలన – ఏప్రిల్ 7
నామినేషన్ల ఉపసంహరణ – ఏప్రిల్ 9
తమిళనాడులో ఏప్రిల్ 23న ఎన్నికలు
మే 4న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
15 Mar 2026 04:41 PM (IST)
పశ్చిమ బెంగాల్‌లో రెండు దశల్లో ఎన్నికలు
పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు
పశ్చిమ బెంగాల్‌లో రెండు దశల్లో ఎన్నికలు
ఏప్రిల్ 23న తొలిదశ, ఏప్రిల్ 29 రెండో దశ ఎన్నికలు
మే 4న ఎన్నికల ఫలితాలు..
15 Mar 2026 04:29 PM (IST)
ఎన్నికల తేదీలు వచ్చేశాయ్..
అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే విడతలో పోలింగ్
కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో ఏప్రిల్ 9న పోలింగ్.. మే 4న కౌంటింగ్
తమిళనాడులో ఏప్రిల్ 23న పోలింగ్.. మే 4న కౌంటింగ్
పశ్చిమ బెంగాల్‌లో ఏప్రిల్ 23, 29 తేదీల్లో పోలింగ్
15 Mar 2026 04:20 PM (IST)
5 రాష్ట్రాల్లో 17.4 కోట్ల మంది ఓటర్లు
5 రాష్ట్రాల్లో 17.4 కోట్ల మంది ఓటర్లు – సీఈసీ
5 రాష్ట్రాల్లో 2.19 పోలింగ్ స్టేషన్లు – సీఈసీ
ఎన్నికల ప్రక్రియలో 25లక్షల మంది సిబ్బంది
ఓటింగ్‌లో యువత చురుగ్గా పాల్గొనాలి – సీఈసీ
15 Mar 2026 04:11 PM (IST)
ఓటర్ జాబితా ప్రక్రియ సమగ్రంగా నిర్వహించాం
ఓటర్ జాబితా ప్రక్రియ సమగ్రంగా నిర్వహించాం – సీఈసీ
ఈ ప్రక్రియలో పాల్గొన్న అధికారులకు నా అభినందనలు – సీఈసీ
అక్రమ ఓటర్లను ఏరివేతకు SIR కొనసాగుతుంది – సీఈసీ
అర్హత ఉన్న ప్రతీ ఓటర్‌ను జాబితాలో చేరుస్తామని ప్రకటన
15 Mar 2026 04:01 PM (IST)
రేపే బీజేపీ అభ్యర్థుల జాబితా..?
కేరళలో సోమవారం బీజేపీ తొలి దశ అభ్యర్థుల జాబితా విడుదల..?
ఒకే దశలో అభ్యర్థులను ప్రకటిస్తారా లేదా అనేదానిపై సస్పెన్స్..
15 Mar 2026 03:46 PM (IST)
ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
ఎన్నికల షెడ్యూల్ రాగానే అమల్లోకి ఎన్నికల కోడ్..
ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
ప్రభుత్వాలు కొత్త ప్రాజెక్టులు, పథకాలను ప్రారంభించకూడదు.
షెడ్యూల్ తర్వాత 5 రాష్ట్రాల్లో అమల్లోకి రానున్న ఎన్నికల కోడ్..
15 Mar 2026 03:33 PM (IST)
అస్సాంలో అమిత్ షా పర్యటన
అస్సాంలో కేంద్రం హోంమంత్రి అమిత్ షా పర్యటన
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అస్సాం నుంచే పార్లమెంట్‌కు..
ఎన్నికైనా అభివృద్ధిని పట్టించుకోలేదని షా విమర్శలు.
బీజేపీ గత పదేళ్లలో అస్సాంను ఆరోగ్యం, విద్యారంగాల్లో అగ్రస్థానంలో నిలిపింది – అమిత్ షా
15 Mar 2026 03:19 PM (IST)
అస్సాంలో ఆప్ తొలివిడత అభ్యర్థుల జాబితా రిలీజ్
అస్సాం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ తన అభ్యర్థులను ప్రకటించగా, తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ4 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది. రాష్ట్రంలో పార్టీ ఉనికిని బలోపేతం చేయడమే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక జరిగిందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.