Watch Video: కదులుతున్న బస్సులో నుంచి పడిపోయిన మహిళ.. ఆ తర్వాత జరిగిందిదే! వీడియో వైరల్

కదులుతున్న ఆర్టీసీ బస్సులో నుంచి ఓ మహిళ ప్రమాదవశాత్తూ కిందపడిపోయి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన త్రిసూర్‌ జిల్లాలో సోమవారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం..

Watch Video: కదులుతున్న బస్సులో నుంచి పడిపోయిన మహిళ.. ఆ తర్వాత జరిగిందిదే! వీడియో వైరల్
Woman Falls From Moving Bus

Updated on: Aug 13, 2025 | 6:52 AM

త్రిసూర్‌, ఆగస్టు 9: ఓ వృద్ధ మహిళ బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సు ఎక్కింది. అనంతరం బస్సు ముందుకు కదిలింది. అయితే బస్సులోపల ఖాళీగా ఉన్న సీటు కోసం ముందుకు నడుచుకుంటూ వెళ్తున్న సదరు మహిళ ఉన్నట్లుండి పట్టుతప్పి బస్సు డోర్‌ నుంచి బయటపడిపోయింది. ఈ షాకింగ్‌ ఘటన కేరళలోని త్రిసూర్‌లో సోమవారం (ఆగస్ట్‌ 11) చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. వివరాల్లోకెళ్తే..

కేరళలోని త్రిసూర్‌లో ఓ మహిళ (74) బస్సు ఎక్కింది. ఇంతలో కండక్టర్‌ ఆమెవైపు వచ్చి సీటు ఖాళీగా ఉందని అక్కడకు వెళ్లి కూర్చోమని చెప్పడం వీడియోలో కనిపిస్తుంది. దీంతో ఆమె కూర్చునేందుకు వెళ్తుండగా బస్సు కుదుపులకు అదుపుతప్పి బస్సు డోర్‌లో నుంచి ఒక్కసారిగా బయటకు పడిపోయింది. ఈ ప్రమాదంలో సదరు మహిళ ప్రాణాలు అక్కడికక్కడే కోల్పోయింది. రెప్పపాటులో జరిగిన ఈ ఘటనతో బస్సులోని వారంతా షాక్‌కు గురయ్యారు. మహిళ బస్సులో నుంచి బయటకు పడే సమయంలో కండక్టర్‌ ఆమెను పట్టుకునేందుకు ముందుకు పరిగెత్తాడు. కానీ అప్పటికే ఆలస్యమైంది.

ఇవి కూడా చదవండి

కండక్టర్‌ వెంటనే బస్సును ఆపి బాధిత మహిళను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధరించారు. ఈ ఘటనకు సంబంధించిన షాకింగ్‌ దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.