Maharashtra New CM: మహారాష్ట్ర రాజకీయాల్లో మహా ట్విస్ట్.. సీఎం కానున్న ఏక్‌నాథ్ షిండే

మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ శిందే గురువారం రాత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు.

Maharashtra New CM:  మహారాష్ట్ర రాజకీయాల్లో మహా ట్విస్ట్.. సీఎం కానున్న ఏక్‌నాథ్ షిండే
Maharashtra Politics

Updated on: Jun 30, 2022 | 5:02 PM

Maharashtra Political Crisis: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనం. ఊహించని విధంగా శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండేను సీఎంగా కన్పామ్ చేశారు బీజేపీ నేత ఫడ్నవీస్. ఆయనకు తమ పార్టీ మద్దతు ఇస్తుందని తెలిపారు. తాను ప్రభుత్వానికి దూరంగా ఉండనున్నట్లు మరో సంచలన వార్త చెప్పారు. ఈ క్రమంలో షిండే రాత్రి 7:30 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇప్పటివరకు ఫడ్నవీస్ అవుతారంటూ.. ఏకనాథ్ షిండే డిప్యూటీ సీఎం అవుతారని ప్రచారం జరిగింది. కానీ చివరి నిమిషంలో షిండే పేరు తెరపైకి రావడం సంచలనంగా మారింది. అంతకుముందు ఫడ్నవీస్, షిండే కలిసి వెళ్లి మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీని కలిశారు. తమకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల పేర్ల జాబితాను గవర్నర్‌కు సమర్పించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజార్టీ తమకు ఉందని, అందుకు తమను ఆహ్వానించాలని కోరారు.