Education Minister Ramesh Pokhriyal: దేశంలో కరోనా భూతం అలజడి సృష్టిస్తోంది. రోజురోజుకూ ఈ మహమ్మారి కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయి. ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. సాధారణ ప్రజల నుంచి ప్రముఖల వరకూ అందరికీ కరోనా సోకుతోంది. తాజాగా మరో కేంద్ర మంత్రికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్‌కు కూడా కరోనా సోకింది. తాను కూడా ఈ వైరస్ మహమ్మారి బారిన పడ్డానని బుధవారం ట్వీట్ చేశారు. స్వల్ప లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకున్నానని.. కోవిడ్ పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు తెలిపారు. ప్రస్తుతం డాక్టర్ల సూచనలతో మందులు తీసుకుంటున్నానని వెల్లడించారు. ఇటీవల తనను కలిసిన వారంతా జాగ్రత్తగా ఉండాలని.. అవసరమైతే పరీక్ష చేయించుకోవాలని సూచించారు. మంత్రిత్వ శాఖలోని అన్ని పనులను జాగ్రత్తలు పాటిస్తూ నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్ తెలిపారు.
ఇదిలాఉంటే.. దేశంలో కరోనావైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. పలు పరీక్షల నిర్వహణపై రమేష్ పొఖ్రియాల్.. వరుసగా అధికారులతో సమావేశాలు నిర్వహించారు. ఈ వారం ప్రారంభంలో సీబీఎస్ఈ పరీక్షలపై ప్రధాని మోదీ తదితర అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీబీఎస్ఈ 10 వ తరగతి పరీక్షలను రద్దు చేయాలని.. 12 వ తరగతి పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయించారు. అంతేకాకుండా యూజీసీ నెట్ పరీక్షను కూడా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఇదిలాఉంటే.. దేశంలో నిన్న మూడు లక్షలకు చేరువలో కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు రెండువేలకు పైగా మరణాలు సంభవించాయి. ప్రస్తుతం దేశంలో 20 లక్షలకు పైగానే యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Also Read: