Mallikarjuna Kharge: నేషనల్ హెరాల్డ్ అవినీతి కేసులో ఈడీ దూకుడు.. కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే‌ను ప్రశ్నించిన ఈడీ

|

Apr 11, 2022 | 4:25 PM

కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గేను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రశ్నిస్తోంది. నేషనల్ హెరాల్డ్ అవినీతి కేసులో ఖర్గేపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ.. సమాధానాలు రాబడుతున్నారు.

Mallikarjuna Kharge: నేషనల్ హెరాల్డ్ అవినీతి కేసులో ఈడీ దూకుడు.. కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే‌ను ప్రశ్నించిన ఈడీ
Mallikarjuna Kharge
Follow us on

National Herald Corruption Case: కాంగ్రెస్(Congress) సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే(Mallikarjuna Kharge)ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ప్రశ్నిస్తోంది. నేషనల్ హెరాల్డ్ అవినీతి కేసులో ఖర్గేపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ.. సమాధానాలు రాబడుతున్నారు. గతంలోనే ఈ కేసుకు సంబంధించి ఈడీ ఆయనకు సమన్లు​పంపింది. 2012లో బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి ట్రయల్ కోర్టులో ఫిర్యాదు చేశారు. యంగ్ ఇండియన్ లిమిటెడ్ (YIL) అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ కొనుగోలులో కొంతమంది కాంగ్రెస్ నాయకులు మోసం, నమ్మక ద్రోహానికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికను మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ప్రారంభించారు. ఈ విషయంలో సోనియా గాంధీ, మోతీలాల్ వోహ్రా, సుమన్ దూబే, శామ్ పిట్రోడాలను స్వామి ప్రస్తావించారు.

ఫిబ్రవరిలో, ఢిల్లీ హైకోర్టు ఈ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇతర నిందితులను సమాధానాలు కోరింది. గాంధీ కుటుంబానికి నోటీసులు జారీ చేసిన జస్టిస్ సురేశ్ కైత్, స్వామి పిటిషన్‌పై తమ వైఖరిని ఏప్రిల్ 12లోగా తెలియజేయాలని AICC ప్రధాన కార్యదర్శి ఆస్కార్ ఫెర్నాండెజ్, సుమన్ దూబే, శామ్ పిట్రోడా, యంగ్ ఇండియా (వైఐ)లను కోరారు.

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ బోర్డులో ఉన్న వైఐఎల్‌ లాభాలు, ఆస్తులు పొందేందుకు నిద్రాణమైన ప్రింట్‌ మీడియా సంస్థల ఆస్తులను దురుద్దేశపూర్వకంగా కొనుగోలు చేసిందని స్వామి ఆరోపించారు. వైఐఎల్ కొనుగోళ్లలో రూ. 2,000 కోట్ల అవినీతి జరిగినట్లు ఆయన ఆరోపించారు. గాంధీ కుటుంబంతో పాటు, కాంగ్రెస్ కోశాధికారి మోతీలాల్ వోరా, ప్రధాన కార్యదర్శి ఆస్కార్ ఫెర్నాండెజ్, జర్నలిస్టు సుమన్ దూబే, టెక్నోక్రాట్ శామ్ పిట్రోడా తదితరులను కూడా ఈ కేసులో పేర్కొన్నారు.

Read Also….

UP Politics: సమాజ్ వాదీలో రాజుకున్న అసమ్మతి కుంపటి.. కొత్త పార్టీ దిశగా మహ్మద్ ఆజం ఖాన్!