సుశాంత్ కేసులో బిలియర్డ్స్ ప్లేయర్ ని విచారించిన ఈడీ

సుశాంత్ కేసులో రియా చక్రవర్తికి, జాతీయ స్థాయి బిలియర్డ్స్, స్నూకర్ ప్లేయర్ రిషభ్ థక్కర్ కి మధ్య  నడిచిన ఫోన్ చాటింగ్ వెలుగులోకి వచ్చింది.  డ్రగ్స్ విషయంలో ఇతనికి, రియాకు మధ్య వాట్సాప్  ద్వారా చాటింగ్ జరిగిందని...

సుశాంత్ కేసులో బిలియర్డ్స్ ప్లేయర్ ని విచారించిన ఈడీ

Edited By:

Updated on: Sep 02, 2020 | 2:21 PM

సుశాంత్ కేసులో రియా చక్రవర్తికి, జాతీయ స్థాయి బిలియర్డ్స్, స్నూకర్ ప్లేయర్ రిషభ్ థక్కర్ కి మధ్య  నడిచిన ఫోన్ చాటింగ్ వెలుగులోకి వచ్చింది.  డ్రగ్స్ విషయంలో ఇతనికి, రియాకు మధ్య వాట్సాప్  ద్వారా చాటింగ్ జరిగిందని ఈడీ అధికారుల ఇన్వెస్టిగేషన్ లో వెల్లడయింది. రిషభ్ ని వారు సుమారు 8 గంటలపాటు విచారించారు. ఉదయ్ పూర్ లో జరిగే ఓ పెళ్లి వేడుక కోసం తన దగ్గరికి డబ్బుతో వచ్చి డ్రగ్ తీసుకువెళ్ళవలసిందిగా ఈ ఆటగాడు ఎవరో వ్యక్తికి చెప్పిన విషయం కూడా వీరి చాటింగ్ లో ప్రస్తావనకు వచ్చిందట. లోగడ రిషబ్ పలువురు టాప్ బిలియర్డ్స్ స్నూకర్ ఆటగాళ్లతో  ఆడినట్టు తెలిసిందని ఈడీ అధికారులు చెప్పారు. ఇతడి నుంచి రియా డ్రగ్ సేకరించేదా అనేది ఇంకా తేలలేదు.

అయితే తనవద్ద డ్రగ్స్ లేవని, తాను ఎవరికీ మత్తు మందులు సరఫరా చేయలేదని రిషబ్ తెలిపాడని అంటున్నారు. ఇతని స్నేహితులు, సహచరుల మీద కూడా దృష్టి పెట్టిన ఈడీ వారిని కూడా ఇంటరాగేట్ చేసే అవకాశం ఉంది.