వికాస్ దూబే ఆస్తులపై ఈడీ దర్యాప్తు

| Edited By: Pardhasaradhi Peri

Jul 11, 2020 | 1:55 PM

యూపీ పోలీసుల ఎన్ కౌంటర్ లో మరణించిన గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ఆస్తులపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ప్రారంభించింది. అలాగే అతని సహచరుల ఆస్తులపై కూడా దర్యాప్తు మొదలుపెట్టామని ఈడీ వర్గాలు తెలిపాయి. దూబే ని తీసుకువెళ్తున్న..

వికాస్ దూబే ఆస్తులపై ఈడీ దర్యాప్తు
Follow us on

యూపీ పోలీసుల ఎన్ కౌంటర్ లో మరణించిన గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ఆస్తులపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ప్రారంభించింది. అలాగే అతని సహచరుల ఆస్తులపై కూడా దర్యాప్తు మొదలుపెట్టామని ఈడీ వర్గాలు తెలిపాయి. దూబే ని తీసుకువెళ్తున్న వాహనం కాన్పూర్ శివార్లలో యాక్సి డెంట్ కి గురై బోల్తా పడడం, అదే అదనను కుని ఈ క్రిమినల్ తప్పించుకుని పారిపోబోతూ.. తనను పట్టుకోవడానికి వచ్చిన పోలీసులపై కాల్పులు జరపడం, వారి ఎన్ కౌంటర్లో అతడు మరణించడం అంతా సినీ ఫక్కీలో జరిగింది. దూబే కుటుంబ సభ్యులు, అతని సహచరుల ఆస్తులకు సంబంధించిన వివరాలను యూపీ పోలీసుల నుంచి ఈడీ సేకరించడం ప్రారంభించింది. దూబే పై ఉన్న క్రిమినల్ కేసులకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని కూడా అధికారులు కోరారు. కాన్పూర్ నుంచి దూబే ఉజ్జయిని ఎలా చేరుకోగలిగాడన్న అంశంపై యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఉజ్జయినిని విజిట్ చేసే అవకాశాలున్నాయి. దూబే గ్యాంగ్ లోని ఇద్దరు సభ్యులకు షెల్టర్ ఇచ్చారన్న ఆరోపణపై గ్వాలియర్ (మధ్యప్రదేశ్) లో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.

అటు-దూబే మృతదేహానికి శనివారం కాన్పూర్ లోని ఓ విద్యుత్ దహనవాటికలో అంత్యక్రియలు చేశారు. ఈ అంత్యక్రియలకు హాజరైన అతని భార్య రిచా.. తన భర్త తప్పుడు మార్గాన్ని అనుసరించాడని, అతనికి ఇదే గతి పట్టాలని పోలీసులతో వ్యాఖ్యానించింది. మరోవైపు దూబే తండ్రి రామ్ కుమార్ దూబే కూడా పోలీసుల చర్యను సమర్థించారు.