
2016లో అప్పటి కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పార్లమెంట్‌కు ఓ సమాధానం ఇచ్చారు. భారత్‌లో 2 కోట్ల మంది బంగ్లాదేశ్ వలసదారులు ఉన్నారనేది ఆ సమాధానం. ఆ 2 కోట్లలో ఎక్కువ మంది తలదాచుకున్నది బిహార్‌లో. మరీ ముఖ్యంగా బిహార్‌లోని సీమాంచల్ ప్రాంతంలోని నాలుగు జిల్లాల్లో బంగ్లాదేశ్ వలసదారులు ఎక్కువ. బిహార్‌లో 17 శాతం ముస్లింలు ఉంటే.. ఒక్క సీమాంచల్‌లోనే 47 శాతం మంది ముస్లింలు ఉన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో బిహార్‌లో చేపట్టిన ఓటర్ల జాబితా సవరణకు మూలం ఈ డేటానే. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం చేపట్టిన ఈ ప్రాసెస్‌ను బిహార్‌లో మొదలుపెట్టింది. పైకి చూస్తే ఈసీ చేసేది పర్ఫెక్ట్. కాకపోతే.. ఆ టైమింగే రాంగ్ అనేది ప్రతిపక్షాల విమర్శ. ఇంతకీ.. ఏంటీ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్? ఎలక్షన్ కమిషన్ విడుదల చేసే ఓటర్ల జాబితాలో విదేశీయులు కూడా ఉంటారా? ఉంటారు. ఉన్నారు కూడా. బిహార్‌లో ఇప్పటికిప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టడానికి కారణాల్లో ఇదీ ఒకటి. ఇక్కడే ఓ అనుమానం వస్తోంది. ఓటర్ లిస్ట్‌లోకి విదేశీయులు ఎలా వచ్చారసలు? చాలా సింపుల్. ఓటు హక్కు పొందాలంటే ఫామ్-6 అప్లై చేస్తే చాలు. ది రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టర్స్ రూల్స్-1960 ప్రకారం తాము భారతీయులమే అని నిరూపించుకునేందుకు ఎలాంటి డాక్యుమెంట్స్ ఇవ్వక్కర్లేదు. నిజానికి, దేశ పౌరసత్వాన్ని నిర్ణయించే అధికారం ఎలక్షన్ కమిషన్‌కు లేదు కూడా. ఆ పని చేయాల్సింది...