EaseMytrip: మాల్దీవులకు విమాన సర్వీసులను రద్దు.. ‘ఛలో లక్షదీప్‌’ అంటూ ప్రచారం.

ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో బైకాట్‌మాల్దీవ్స్‌ అనే హ్యాష్‌ ట్యాగ్‌ బాగా ట్రెండ్ అవుతోంది. పలువురు బాలీవుడ్‌ నటులు సైతం మద్ధుతుగా పోస్ట్‌లు చేస్తున్నారు. బాలీవుడ్‌ నటులు అక్షయ్‌ కుమార్‌, సల్మాన్‌ ఖాన్‌ లక్షదీప్‌లో పర్యటిద్దాం, మన పర్యాటకానికి మద్దతు ఇద్దాం అంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు చేశారు. దీంతో పలువురు తమ..

EaseMytrip: మాల్దీవులకు విమాన సర్వీసులను రద్దు.. ఛలో లక్షదీప్‌ అంటూ ప్రచారం.
Maldives

Updated on: Jan 08, 2024 | 9:47 AM

భారత ప్రధాని నరేంద్ర మోదీ లక్షదీప్‌ పర్యటన అనంతరం జరిగిన పరిణామాలు చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. మాల్దీవులు మంత్రులు ప్రధాని మోదీపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై దేశ ప్రజలు ఘాటూగా స్పందిస్తున్నారు. మాల్దీవులకు తాము బుక్‌ చేసుకున్న టూర్‌ను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటిస్తున్నారు.

ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో బైకాట్‌మాల్దీవ్స్‌ అనే హ్యాష్‌ ట్యాగ్‌ బాగా ట్రెండ్ అవుతోంది. పలువురు బాలీవుడ్‌ నటులు సైతం మద్ధుతుగా పోస్ట్‌లు చేస్తున్నారు. బాలీవుడ్‌ నటులు అక్షయ్‌ కుమార్‌, సల్మాన్‌ ఖాన్‌ లక్షదీప్‌లో పర్యటిద్దాం, మన పర్యాటకానికి మద్దతు ఇద్దాం అంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు చేశారు. దీంతో పలువురు తమ మాల్దీవులు పర్యటనను కూడా రద్దు చేసుకుంటున్నట్లు సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు చేయడం వైరల్‌గా మారింది.

ఇదిలా ఉంటే.. తాజాగా ప్రముఖ ట్రావెల్ కంపెనీ ‘ఈజ్‌మైట్రిప్‌’ సైతం మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆ దేశానికి అన్ని విమాన బుకింగ్‌లను నిలిపివేస్తున్నట్లు సంచనల ప్రకటన చేసింది. ఈ విషయాన్ని ఈజ్‌మైట్రిప్‌ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ నిషాంత్ పట్టి అధికారికంగా ప్రకటించారు. మన దేశానికి సంఘీవంగా, ఈజ్‌మైట్రిప్‌ అన్ని మాల్దీవుల విమాన బుకింగ్‌లను నిలిపివేసింది’ అని ట్విట్టర్‌ వేదికగా ప్రకటించారు. అంతటితో ఆగకుండా ‘ఛలో లక్షదీప్’ హ్యాష్‌ట్యాగ్‌ను పోస్ట్‌ చేసింది.

ఇదిలా ఉంటే మాల్దీవులను అత్యధికంగా సందర్శించే వారిలో భారతీయులే మొదటి స్థానంలో ఉంటారు. దేశ పర్యాటక మంత్రిత్వశాఖ టేటా ప్రకారం డిసెంబర్‌ 2023 వరకు మాల్దీవులకు వచ్చిన సందర్శకులలో భారతీయ పర్యాటకులు అత్యధికంగా ఉన్నారు. మాల్దీవులను సందర్శించిన అత్యధిక సంఖ్యలో భారత్‌ నుంచి 2,09,198, రష్యా నుంచి 2,09,146, చైనా నుంచి 1,87,118 మంది మాల్దీవులను పర్యటించారు. అయితే ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో మాల్దీవులకు వెళ్లే వారి సంఖ్య తగ్గుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..