Earthquake: రాజధానిలో భూకంపం.. పశ్చిమ ఢిల్లీలో స్వల్పంగా కంపించిన భూమి..

|

Jan 28, 2021 | 11:01 AM

ఉత్తర భారతదేశంలో వరుస భూకంపాలు సంభవిస్తూనే ఉన్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో గురువారం మరోసారి భూప్రకంపనలు

Earthquake: రాజధానిలో భూకంపం.. పశ్చిమ ఢిల్లీలో స్వల్పంగా కంపించిన భూమి..
Follow us on

Earthquake in Delhi: ఉత్తర భారతదేశంలో వరుస భూకంపాలు సంభవిస్తూనే ఉన్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో గురువారం మరోసారి భూప్రకంపనలు సంభవించాయి. నగరంలో ఈ రోజులు భూమి స్వల్పంగా కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 2.8గా నమోదైనట్టు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (ఎన్‌సీఎస్) వెల్లడించింది. గురువారం ఉదయం 9:17 గంటలకు పశ్చిమ ఢిల్లీలో ప్రకంపనలు చోటుచేసుకున్నాయనీ.. 15 కిలోమీటర్ల లోతున భూకంపం కేంద్రం కేంద్రీకృతమై ఉందని సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది. అంతకుముందు కూడా రాజధానిలో భూమి చాలా సార్లు కంపించింది. తాజాగా మరోసారి భూమి కంపించడంతో ఢిల్లీ ప్రజలు భయాందోళనకు గురయ్యారు.