Earthquake: మరోసారి అండమాన్‌ సముద్రంలో భారీ భూకంపం!

అండమాన్‌ సముద్రంలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. శనివారం తెల్లవారుజామున ఒక్కసారిగా భూమి కంపించింది. రిక్టరు స్కేలు పై భూకంపం తీవ్రత 4.6గా నమోదైనట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ తెలిపింది. భూమికి 25 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు NCS పేర్కొంది. అండమాన్, నికోబార్ దీవులలోని పోర్ట్‌బ్లెయిర్‌కు 254 కి.మీ ఆగ్నేయంలో ఈ భూకంపం సంభవించినట్టు తెలుస్తోంది.

Earthquake: మరోసారి అండమాన్‌ సముద్రంలో భారీ భూకంపం!

Updated on: Jun 28, 2025 | 1:54 PM

అండమాన్‌ సముద్రంలో భారీ భూకంపం సంభవించింది. శనివారం తెల్లవారుజామున ఒక్కసారిగా భూమి కంపించింది. రిక్టరు స్కేలు పై భూకంపం తీవ్రత 4.6గా నమోదైనట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ తెలిపింది. భూమికి 25 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు NCS పేర్కొంది. అండమాన్, నికోబార్ దీవులలోని పోర్ట్‌బ్లెయిర్‌కు 254 కి.మీ ఆగ్నేయంలో ఈ భూకంపం సంభవించినట్టు తెలుస్తోంది. ఈ భూ ప్రకంపనలతో సముద్రం ఒక్కసారిగా అల్లకల్లోలంగా మారింది. దీని తీవ్రతకు తీర ప్రాంతాల్లో కూడా భూ ప్రకంపనలు ఏర్పాడ్డాయి. దీంతో స్థానిక ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కపడ్డారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

ఇదిలా ఉండగా ఇటీవలే జూన్ 25న అండమాన్ సముద్రంలో భూకంపం సంభవించింది. అప్పుడు రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్ర 4.2గా నమోదైంది. అప్పుడు కూడా సుమారు సముద్ర నుంచి 20 కిలోమీటర్లలోపుతో భూకంప కేంద్రం ఏర్పడింది. మరోవైపు శనివారం దక్షిణ ఫిలిప్పీన్స్‌లో కూడా భూకంపం సంభవించిందని రాష్ట్ర జియోలాజికల్ సర్వే తెలిపింది. అక్కడ భూకంప తీవ్రత 6.1గా నమోదైనట్టు తెలిపింది. ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణనష్టం అయితే జరగలేదని స్పష్టం చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి